Character (శీలం) అనేది రెండు రకాలు.
1. Individual Character (వ్యక్తి గత శీలము)
2. National Character (జాతీయశీలము)
ఆ నేషనల్ క్యారక్టరే చారిత్రము. అదియే చరిత్ర -రామచరిత్ర కృష్ణచరిత్ర - ఇలాంటివన్నీ చరిత్రలుగా రూపొందినాయి కేవలం మన చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పటానికి వీలు కాదు. అది మహా అవమానం , His story is History దైవము యొక్క కథ అతని గుణగణములను వివరించేదే Story (కథ) అతని ఆదర్శవంతమైన గుణములే మనకు కథలు. ఇట్టి చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి. చారిత్రాత్మకుడు కావాలి కాని, జీవాత్మకుడు కాకూడదు. కదిలిపోయే మేఘముల వంటి ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి కీర్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి ఈ లోకంలో ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటటువంటి మేధావులున్నారుగాని, అనేకత్వంలో వున్నటువంటి ఏకత్వాన్ని చేర్చేటటువంటి మేధావులు కనిపించటం లేదు. కనుకనే ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటటువంటివాడు మేధావి. అనేకత్వం లోని ఏకత్వాన్ని విశ్వసించేటటువంటివాడే చారిత్రకుడు. కనుకనే Unity in diversity(అనేకత్వంలో ఏకత్వం ) ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
(శ్రీ.ఆ.96 పు.31)
ఒక పర్యాయం ప్రహ్లాదుడు విశ్వజిత్ యాగం చేసినప్పుడు, ఇంద్రుడు దేవగురువు యొక్క సలహాపై ఒక చిన్నబ్రాహ్మణ పిల్లవానివేషంలో అతనివద్దకు వెళ్ళాడు.బ్రాహ్మణు లంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి, “నాయనా! నీకు ఏమి కావాలి?" అని అడిగినాడు. ప్రహ్లాదుడు. "నాకు నీశీలమును దానం చేయి," అన్నాడు ఇంద్రుడు, "పిచ్చివాడా! ఇంత చిన్న కోరిక కోరుతున్నావేమిటి? ఇంకా ఏదైనా అడుగు, ఇస్తాను." అన్నాడు ప్రహ్లాదుడు. "నాకిదే చాలు." అన్నాడు బ్రాహ్మణ పిల్లవాని వేషంలో ఉన్న ఇంద్రుడు. ప్రహ్లాదుడు "సరే ఇచ్చినాను, వెళ్ళు." అన్నాడు. తక్షణమే ప్రహ్లాదునినుండి శీలము తళతళలాడుతూ, మిలమిలా మెరుస్తూ ఇంద్రునిలో చేరిపోయింది. దానిని లెక్క చేయలేదు. ప్రహ్లాదుడు. తరువాత కొంత సేపటికి దివ్యకాంతితో వెలుగొందుతున్న ఒక స్త్రీ తన నుండి వెళ్ళిపోవడం గమనించాడు."అమ్మా! నీ వెవరు?” అని అడిగాడు. ఆమె "నేను నీరాజ్యలక్ష్మిని.శీలము లేనిచోట నేను ఉండటానికి వీలుకాదు."అని - పలికింది. కొంత సేపటికి మరొక దివ్యాంగన వెళ్లిపోవడం గమనించి "అమ్మా నీవెవరు?" అని ప్రశ్నించాడు."నీ యశస్సును, శీలము, రాజ్యలక్ష్మి లేనిచోట నేనుండలేను. " అని సమాధానమిచ్చింది. ఈ విధంగా, శీలమును కోల్పోయిన తక్షణమే ప్రహ్లాదుడు తన సర్వస్వమునూ కోల్పోయాడు. అప్పుడు శీలము యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రహ్లాదుడు, “నారాయణా! నాకు ఈ రాజ్యం అక్కరలేదు; సైన్యం అక్కరలేదు. ఒక్క శీలమును మాత్రం నాకు అనుగ్రహించు."అని ప్రార్ధించాడు. ప్రహ్లాదుని త్యాగానికి మెచ్చుకొని నారాయణుడు అతనికి శీలమును తిరిగి అను గ్రహించాడు. కనుక, శీలమును మించిన శక్తి మరొకటి లేదు.
(స.సా.ఫి.2000 పు. 277/278)
గౌతమ బుద్ధుడు, "బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్ఛామి" అన్నాడు. అనగా బుద్ధిలో ధర్మమును ప్రవేశపెట్టి బుద్ధిని సంఘంలో ప్రవేశపెట్టాలి. ధర్మమనగా ఏమిటి? హృదయము, వాక్కు, క్రియ - ఈ మూడింటి ఏకత్వమే నిజమైన ధర్మం. దీనినే భారతీయులు త్రికరణశుద్ధి అన్నారు. మన ప్రాచీనులుమనిషికి శీలమే చాల ప్రధానమైనదని విశ్వసించారు. wealth is lost, nothing is lost; if health is lost, something is lost; If character is lost, everything is lost (సంపద పోయిందంటే ఏమీ పోనట్లే, ఆరోగ్యం పోయందంటే ఏదో కొంత పోయినట్లు, కానీ శీలమే గనుక పోయిందంటే అంతా పోయినట్లే) అని వారు భావించారు. కాని ఈనాటి పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. సంపద పోతే అంతా పోయినట్లే అని విచారిస్తున్నారు; శీలం పోతే ఏమీ పోనట్లుగా భావిస్తున్నారు. శీలమే లేక ఎంత బలమున్నా, ఎంత ధనమున్నా ప్రయోజనం లేదు.
(స. సా.పి.98 పు.41/42)
సమస్త శాస్త్రముల సారము సర్వ ధర్మమయమైన శీలముప్రధాన సాధనము. శీలము ఒక్కజాతికికి మతమునకు, సంప్రదాయమునకు సంబంధించినది కాదు. దీనిని సర్వసమన్వయ పద్ధతిలో బోధించబడినది. దీనిని ఆశ్రయించినవారు ఎనాటికైననూ చెడరు. పుణ్యాత్ములు కాగలరు. జీవుల అంత:కరణశుద్ధికి గుణములు ప్రధానమార్గము. ఈ గుణము ఏదిచేయవలెను. ఎట్లు చేయవలెను. అని చక్కగా విచారించును. నొసటి వ్రాత మంచిదయిన వారికే ఈ గుణము ప్రాప్తించును. ఈ గుణమే భవసాగరమును దాటించు భద్రమైన నావ. గుణమును ఆశ్రయించిన వారికి మోక్షమున స్థలము కలదు. ఎంతటి ప్రారబ్ధ కర్మలనుభవించు వాడైననూ శీల పోషణ కలవానిని కర్మ ఫలమంటదు. ఇతను పరమానంద రూపమైన బ్రహ్మముచేరును.
(సూ.వా.పు.11)
మనస్సులోధార్మికచింతనఉంటే, శీలంలోసౌందర్యంఉంటుంది. శీలంలోసౌందర్యంఉంటే, గృహంలోఅన్యోన్యతఉంటుంది. ఇంటిలోఅన్యోన్యతఉంటే, దేశంలోక్రమశిక్షణఉంటుంది. దేశంలోక్రమశిక్షణఉంటే, ప్రపంచంలోశాంతిఉంటుంది. (సనాతనసారథి, జులై 2019)
(చూ: భద్రము, మహోపద్రవాలు, రామలక్ష్మణులు, సాధకుడు, స్త్రీ ధర్మము, నోరు)