శాంతి అంటే ఎవ్వరెన్ని తిట్టినా, ఏమనినా, బెల్లంకొట్టినరాయిలాగా కూర్చోడం కాదు. దీనికి కూడా హృదయం చలింపక, పూర్ణ ఇంద్రియ నిగ్రహమే శాంతి. దీనికి త్యాగము ముఖ్యము. శాంతి పాఠములందు శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా, శాంతిచేకూరాలని ఓం శాంతి, శాంతి, శాంతి: అని మూడు పర్యాయములు చెబుతాము. జనక మహారాజునకు వైదేహుడను పేరు. అనగా దేహము వున్నను దేహము మరచిన వాడని యర్థము. ఏది చూచినా ఏది చెప్పినా ఏది విననా, అంతా దైవ భావముతో చేసినప్పుడు ఆభావము ఏర్పడుతుంది. "భక్తితోడ భగవంతుని తలచి నిత్య ధర్మములు నిర్వర్తించిన యట్టి జనకునకు రాజ యోగమున మోక్షము పొందెను." అని చెప్పినట్లు శాంతికి ఉదాహరణము జనకుడే.
(సా.పు.346)
శాంతి లేక పోతే సత్యమును చూచుటకు వీలుకాదు. పూవులు విడచుటకును, పండ్లు పండుటకును, సూర్యరస్మి అవసరము. అట్లా మానవత్వము పరిపూర్ణత చెందడానికి
శాం తి అవసరము. అప్పుడే సనాతనుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు.
(సా.పు.383)