భగవద్గీత - అంతరార్థము

భగవద్గీతయందు కౌరవులు, పాండవులు హస్తినాపురం నిమిత్తం యుద్ధము చేసినది బాహ్యార్థము. కాని అంతరార్థము మధురమైనది. హస్తిమంజరమునకు హస్తినాపురమని పేరు. హస్తినాపురమునకు. నవ ద్వారములు కలవు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వము. ఒకడు సాక్షిభూతుడుగా వున్నాడు. అట్టినిర్గుణ పరబ్రహ్మ మాయాలనే దానిని వరించాడు. అందువలననే పరబ్రహ్మను మాయోపాధి అందురు. మాయకు పరబ్రహ్మమునకు, మనస్సుకుమారుడు, మనస్సు అనేకరకములుగా తల్లినే అనుసరించును. తండ్రి జాడలు కనపడలేదు. మనస్సుకు మాయతత్వము యిష్టము. నిర్మలత్వమైన తండ్రి గుణములు యిష్టములేదు. మనస్సనే కుమారుని పెంచి పెద్దచేసి పెండ్లి చేసారు. మనస్సుకు రెండు పెండ్లిండ్లు అయినవి, ప్రవృత్తి నివృత్తి, అనే యిద్దరు మనస్సును పెండ్లి చేసుకున్నారు. మనస్సుకు ప్రవృత్తి పైనే మక్కువ, నివృత్తిని చూచి చూడనట్లుగావెళుతుంటాడు. ప్రవృత్తికి అనేక మంది పిల్లలు పుట్టారు. నివృత్తికి అయిదుమంది మాత్రమే పిల్లలు పుట్టారు. అనేకమంది అయిన ప్రవృత్తి పిల్లలు అమరులు నివృత్తి పిల్లలు అయిదుమంది దైవస్వరూపులు. ప్రవృత్తి నివృత్తి పిల్లలయినవారే. కౌరవులు, పాండవులు, నివృత్తి బిడ్డలు అయిదుమంది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఈ అయిదుదైవలక్షణములుగా వుండుటచేత దేవతలు, ప్రవృత్తి సంతతి అయిన అసురులు దుర్గుణములన్ని చేర్చుకొన్నారు. అందుచే కౌరవుల పేర్లన్ని దుకారముతోనే ప్రారంభమైనవి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అని దులోనే ప్రారంభమయినవి. దుకారము దుఃఖహేతువు, దుర్గుణములతో దుఃఖములపాలైరి. వీరుయిరువురు హృదయ సామ్రాజ్యము కొరకు యుద్ధము చేసినారు, హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రము, దుర్గుణములకు, సద్గుణములకు ధర్మక్షేత్రమునందు నిత్యము యుద్ధము జరుగుచుండును. మనస్సు గ్రుడ్డివాడు అతనే దృతరాష్ట్రుడు. దృతం, రాష్టు ఇతీహిధృతు. తనది కానిదానిని తనదిగా విశ్వశించుట దృతరాష్ట్రుతత్వము. అట్టిదే మనస్సు తనది కాని దానిని అంతయు కావాలి అని ఆశించును. మనస్సునకు కోతికి హెచ్చుతగ్గు వుండదు. మనస్సు కుచ్చితము, అసహ్యము ఆశించును, మంచిని ఆశించుట ఆలవాటులేదు. ధృతరాష్ట్రుడు తనదికాని రాజ్యమును తనకు కావాలని ఆశించి తనకుమారులు దుర్మార్గులైన వారి వెనుకనే వెళ్ళెను. ధృతరాష్ట్రుడు అనే మనస్సు పరిపరి విధములుగా పోయినపుడు, కుమారుల దుస్తితికి, హీనస్తితికి తండ్రియే కారణము అని గీతబోధించును. మనస్సును అరికట్టి. వుద్రేకములకు వుప్పొంగే రౌద్రములకు దానిని పోనివ్వకూడదు. మనస్సు విషసర్పములాంటిది, పాము తిన్నగా నడువదు సొట్టమార్గములో పోతుంది. అదేవిధముగా మనస్సు యిటు అటుపోతుంది. దానినే "యవ్వనసన్ని పాతకము" అంటారు. యిది అహంకార తత్వము, అజ్ఞానము యొక్క చిహ్నము అనే చెప్పవచ్చు.పాముకు రెండవ దుర్గుణము యేది మూతికి తగిలిన కరుచుకొంటూ పోవును. అటువంటిదే మనస్సు,చూచినవన్నీ కావాలని కోరుకోవటము. ఈ రెంటికి తగిన రెండు దంతములున్నాయి. ఆరెండు దంతములు తీసిన ఆడించి పొట్టపోసుకొనే వారికి వుపయోగపడును. యట్టి విషదంతములు రెండు మనకూ వున్నవి. అవి అభిమానము, మమకారము. యీ రెండు తీసివేసిన జగత్తునకే వుపకారము, లోక కళ్యాణమేకాక స్వార్థమును దూరము చేసి పరార్థమును పొందుటకు అవకాశము కలుగును. యువకులైన మీరు ఆదర్శప్రాయులై లోకమున తల్లీ తండ్రులను సంతోషపెట్టి యెవ్వరికి బాధకలుగ నీయక యెవ్వరిని నొప్పించక భారతదేశ కీర్తిని నిలుపుటకు తయారగుదురని ఆశిస్తున్నాను. భుజబలము బుద్ధిబలము ధనబలము జనబలము శాశ్వతముకాదు. దైవబలము నిజబలము. దానిని అభివృద్ధి పరచే ప్రయత్నమునందే మానవత్వము నకు సార్థకత లభించును.

(భ.స.వే.ప్ర. పు. 136/138)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage