ప్రేమ లేని హృదయము పాషాణ హృదయము. ప్రేమలేని హృదయము కఠిన హృదయము, హృదయం లేని వారికి ఎన్ని విద్యలు నేర్పి ఏమి ప్రయోజనము?
"చదువు వలన లేదు
తర్క శాస్త్ర వాదమునందు లేదు
వివిధ మతములందు లేదు.
వేద వాదములందు లేదు
కలదు...కలదు.... ఒక్క జాలి హృదయమందె"
కనుక, ఆ జాలి హృయమనేటటువంటిది. ప్రతి మానవునికి అత్యవసరము ఈ జాలి హృదయము లేనటువంటి మనస్సు ఎన్ని చదువులు చదివి ఎన్ని పదవులను ఏలి, ఎన్ని విధములై నటువంటి ధనమును ఆర్జించినప్పటికీ ప్రయోజనమేమి?
(శ్రీ,మా 95 పు.7)
(చూ|| ప్రేమ)