రావణ వధ జరిగిన తరువాత, విభీషణ, సుగ్రీవ, జాంబవంత, అంగద మున్నగువారు ముందుకు వచ్చి "రామచంద్రా" నీవు ఈ విజయమును సాధించినావు. అయోధ్యను భరతుడేలుచున్నాడు. ఈ లంక స్వర్గం కంటె మించినదిగా ఉంటున్నది. స్వర్ణమయముగా ఉంటున్నది. కనుక తమరిక్కడనే ఉండి ఈ లంక యొక్క పరిపాలన సాగించండి" అన్నారు. అప్పుడు రాముడు : “పిచ్చివాడా! కేవలము తన తల్లి కురూపిగా ఉంటుందని, ఏదో ఒక అందమైన దానిని తన తల్లి అని పిల్వడానికి సాధ్యమౌతుందా? నా భారతదేశము పేదరికముగా ఉండవచ్చు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" స్వర్గం కంటే మించినటువంటిది నా జన్మభూమి. నా కన్న తల్లి, నా జన్మభూమి ఆ స్వర్గము కంటే మించినది. ఇది మాత్రము నేను వదలను " ఇటువంటి వన్నియు సామాన్య మానవునకు ఒక ఆదర్శమును అందించిన మూర్తి శ్రీరామచంద్రమూర్తి.
(స,సా..వా. 1989 పు. 147)