విదేశాలు సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో, ఎంత నిండి యుండినా, భారతదేశము ఏమీ తక్కువకాదు. భారతదేశం మహా భాగ్యభూమి. అన్నపూర్ణాదేవి. భోగభాగ్యాలకు ఏమీ తక్కువ లేదు. నీ దేశాన్ని నీవు గౌరవించు. రాముడు రావణుని చంపి విజయం సాధించిన తర్వాత విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు అంతా కలపి రాముడినే లంకా రాజ్యానికి అధిపతిని చేయాలనుకున్నారు. అయోధ్యలో లేని సిరిసంపదలు లంకలో ఉన్నాయి. ఇక్కడ భవనాలు అన్నీ స్వర్ణమయంగా ఉన్నాయి. స్వర్గాన్ని కూడా మరుపిస్తున్నాయి. ఇక్కడే ఉండి లంకను పాలించమని చెప్పేరు. ఈ లంకలన్ని సిరిసంపదలతో ఉన్నా అయోధ్య నాజన్మభూమి. దాన్ని ఎన్నడూ మరువను, విడువను. జననీ జన్మభూమిశ్చ: స్వర్గాదపి గరీయసి అన్నాడు. రాముని ఆదర్శం ముందుంచుకొండి. జన్మభూమిని మరువకండి. మాతృదేశం ఋణం తీర్చుకోండి.
(దే. యు.పు. 46)