సంక్రాంతి దినమునాడు గుమ్మడి కాయలను ఇతరులకు దానము చెయ్యాలి అనేది మన సంప్రదాయం. కూరగాయలలో పెద్ద స్వరూపము గలది గుమ్మడికాయ. ఉన్నత స్థాయికి చెందినటు వంటిది గుమ్మడికాయ, అనగా మనము ఇతరులకు ఉన్నత భావములనే అందించాలి గాని, అల్పమైన భావములను కాదు – అని గోపికలు దీని ద్వారా చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు. గుమ్మడి కాయ స్వల్ప కాలంలో చెడిపోవునది కాదు. ఇది చాలా కాలం విలువ ఉంటుంది. దీనిని ఎన్నో రకాలుగా వండుకోవచ్చును. ఈ పర్వదినము నాడు ఇట్టి ఉన్నతమైన, ఉత్తమమైన ఫలాన్ని ఇతరులకు అందించాలి. అనగా, ఉన్నతమైన గుణాన్ని ఇతరులకు అందించాలి అని అర్థం.
(స.సా. ఫి-మా 92 పు. 33)