మనం నిర్విరామ కృషి చేయడం వలన చాలా విసుగెత్తుతున్నాము. అలసట చెందుతున్నాము. కాని, మన గుండె ఏమని ప్రబోధిస్తున్నది? "ఓరి పిచ్చివాడా! నిర్విరామ కృషియే ఏ జీవిత ప్రధాన లక్ష్యము" అని ఆంటున్నది. “కర్మాను బంధీని మనుష్య లోకే" మనుష్యులు కర్మచేత కట్టుబడినవారు. నీవు కర్మాచరణ నిమిత్తమే జన్మించావు. కనుక, నీవు అలసిపోయినావని Imagination కు అవకాశము ఇవ్వరాదని గుండె బోధిస్తున్నది. ఏవిధంగా? గుండె నిరంతరం కొట్టుకుంటూనే ఉన్నది. ఐతే, దానికి ఒక రెస్టు ఉన్నది. ఏమిటిది? రక్తం గుండెకుపోయి చేరినప్పుడు అక్కడ ఆ Cell full అయ్యేంతవరకు దానికి రెస్టు ఉంటుంది. అది full అయిన తక్షణమే దానిని పంపుకొట్టి ఊపిరితిత్తులకు పంపిస్తున్నది. ఈ విధంగా “నా పనిలోనే నాకు రెస్టు ఉన్నది " అని గుండె చెపుతున్నది.
ఒక్కొక్క పర్యాయం మా పిల్లలు - స్వామీ! మేము ఉదయం నాల్గు గంటలకే లేచి రాత్రి పదకొండు గంటల వరకు చదువు తుంటాము. మాకు ఆసలు రెస్టు లేనే లేదు" అని అంటుంటారు. "Rest అంటే ఏమిటి? పరుపు వేసుకొని పడుకోవటం Rest కాదు; Change of work is Rest" అని నేను చెపుతుంటాను. గుండెలో కూడా ఈ విధమైన Change of work జరుగుతున్నది. Cell full అయ్యేంతవరకు గుండెకు రెష్టు. ఈ తరువాత తిరిగి పంపుకొడుతున్నది. ఇది ఎంతో సూక్ష్మముగా జరిగి పోతున్నది! మన Blood cells లో ఎంతో పని జరుగుతోంది. ఈ సృష్టి రహస్యాన్ని ఎవ్వరూ గుర్తించలేరు. మన దేహమంతా Blood cells తేనే కూడి ఉంటున్నది. ఒక్క Cell లోపల ఏ Power అయితే ఉన్నదో మిగిలిన అన్ని Cells లో కూడా అదే ఉన్నది.
మన గుండె చాలా గొప్ప కృషి చేస్తున్నది. రక్తము purify అయిన తరువాత తక్షణమే దానిని పంపుకొట్టి త్యాగం చేస్తున్నది. ఈ విధంగా మానవునికి త్యాగమును బోధిస్తున్నది. మన దేహంలో నిరంతర Blood circulation జరుగుతునే ఉంది. ఇట్టి త్యాగమే లేనిచో రక్తం ఉన్నచోటే ఉండిపోయి అక్కడ boil ఏర్పడుతుంది; అది మనకు రోగంగా రూపొందుతుంది. త్యాగం వలన ఎంతో క్షేమము కలుగుతున్నది. కనుక, మన జీవితంలో ముందుకు నడవాలంటే త్యాగము అత్యవసరము. "నకర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానశుః", కనుక, త్యాగము చేతనే అమృతత్వం (Immortality) చేకూరుతున్నది. What is the way to immortality? Removal of immorality is the only way to immortality. కనక, Immorality, మనము దూరం చేసుకోవాలి. పిల్లలకు బాగా తెలుసు - ఈత కొట్టేటప్పుడు ముందరున్న జలాన్ని వెనుకకు నెట్టినప్పుడే నీవు ముందుకు పోగలవు. లేకపోతే ఉన్నచోటనే ఉంటావు. అదేవిధంగా జీవితంలో త్యాగం చేస్తూ రావాలి. మంచినిగాని, చెడ్డనుగాని అన్నింటినీ త్యాగం చేయాలి. మన శరీరం ఎంత గొప్పగా పనిచేస్తున్నదో యోచించింది. - ఇందులో అన్ని స్వార్థ రహితంగా పని చేస్తున్నది. దీనికొక చక్కని ఉదాహరణ: ఈ టంబ్లర్ లో పళ్ళరసం ఉంటున్నది. కాని, దీని రుచి టంబ్లర్‌కు తెలియదు. దీనిలో స్ట్రా (Straw) వేసి దాని ద్వారా జ్యూ స్ ను నోటి లోనికి పీల్చుకొంటాము. దాని రుచి స్ట్రా కు కూడా తెలియదు కాని, నాలుకకు మాత్రం తెలుస్తుంది. ఐతే, నాలుక రుచి చూస్తుందే గాని, Enjoy చేయటం లేదు. "ఆహా...! ఈ జ్యూస్ తీయగా ఉంటున్నది" అని గుర్తించి దానిని జఠరాగ్నికి పంపుతున్నది. ఒకవేళ అది రుచికరమైనది కాకపోతే దానిని బయటకు పంపివేస్తుంది. కనుక, నాలుక రుచి చూస్తున్నదే కాని, అనుభవించటం లేదు. అట్లే, మన గుండె కూడా టంబ్లరు వంటిది. దీనిలో life అనే Juice ఉంటున్నది. కాని, గుండెకు ఏమీ తెలియదు. తనలో ఉన్న పైపుల వంటి స్ట్రాల ద్వారా దానిని శరీరమంతటా సరఫరా చేస్తున్నది. కాని, బుద్ధి మాత్రం Taste చేస్తుంది. ప్రతి విషయాన్ని ఇది మంచిదా? చెడ్డదా? అనే విచక్షణలో విచారిస్తుంది. కాని, తాను అనుభవించదు. అంతటినీ Life source కి పంపిస్తుంది. బయట ఉండేది - Force లోపల ఉండేది - Source. ఆ Source కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
మన దేహంలో ఎన్నో రకములైన cells ఉన్నాయి; ఎన్నో రకములైన Nerves ఉన్నాయి. ఈ Divine source వాటి ద్వారా ఎంతటి పని చేయిస్తున్నది! ఒక వైపున కండరాలను పెంచుతున్నది. మరొకవైపున Nerves కు తగిన శక్తి నందిస్తున్నది. పంచేంద్రియాలను ప్రకటింపజేస్తున్నది. కన్నులకు చూపునిస్తున్నది. చెవులకువినికిడి నిస్తున్నది, నాలుకకు రుచినిస్తున్నది. దీనికంతటికి కారణం - Divine source మాత్రమే. దాని రహస్యాన్ని ఎవ్వరూ చెప్పలేరు. కాని, నేటి వైజ్ఞానికులు దానిని - "Law of Nature" అంటున్నారు. ఐతే, ఈ Law అనేది ఎక్కడి నుండి వచ్చింది? దీనిని ఏర్పరచినవాడొకడు ఉండాలి కదా! ఈ వెండి గ్లాసు Ready made గా రాలేదు. దీనిని తయారు చేసినవాడొకడు ఉంటున్నాడుకదా! ఐతే, వెండి అనేది భగవత్ సృష్టి కాని, గ్లాసు మాత్రం మానవ సృష్టి అదే విధంగా, ప్రపంచంలో నీటిని, మట్టిని సృష్టించినవాడు - భగవంతుడు. కాని, ఈ రెండింటిని కలిపి కుండలను తయారు చేస్తున్నాడు కుమ్మరి, కనుక, పంచభూతముల సృష్టికర్త భగవంతుడే. ఈ విధమైన సృష్టి వేరొకరు చేయలేరు.
(స.సా.మా. 93 పు. 63/65)
(చూ|| ప్రధానమైన కారణములు)