గానము

భగవంతుడు గానప్రియుడు. తుంబురనారదులు గానంచేస్తుంటే భగవంతుడు తన్మయుడవుతుంటాడు. గానములోనే భగవంతుడు లీనం అవుతాడు. అందువల్లనే సామూహిక భజన అనేది ఏర్పడి మీకు గానం చేయడం తెలియదని మీరు నిరుత్సాహ పడనక్కరలేదు. మీ హృదయంలోనే మీరు గానం చేసుకోండి. పదిమంది వినాలని శ్రుతిలయ రాగతాళములను చూసుకోవద్దు. గానములో నున్న ఆకర్షణ మరోక దానిలో కనిపించదు. అనేక మంది కవులు ఎన్నో పద్యాలు వ్రాస్తుంటారు.  ఓరామా! నన్ను కాపాడుఅని పద్యంలో చెబుతుంటాడు. మరి కొందరు వచనంలో చెబుతుంటారు. ఈ రెండు అంత ఆకర్షణీయంగా ఉండవు. "రామా... నన్ను కాపాడుఅని గానం చేస్తే అది హృదయాన్ని కరిగిస్తుంది. గానము భగవంతుని వరప్రసాదమే. చక్కగా గానం చేయాలని ఎంత మందో ప్రయత్నిస్తున్నారు. కాని విఫలమై పోతున్నారు. కొందరు ఏ ప్రయత్నమూ చేయకపోయినా సులభంగాసున్నితంగా మధురంగాఆనందంగా గానం చేయగల్గుతున్నారు. ఇది భగవంతుని వరప్రసాదమే. ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి ఉన్నదిక్కడ. గానమువల్ల ఆమె హృదయం మధురంగా మారిపోయింది. ఇది ప్రాక్టీసు చేస్తే వచ్చేది కాదు. ఇది భగవదనుగ్రహప్రసాదమే.

 

బాహ్యంగా భజన చేస్తే పదిమందికి ఆనందము నందించవచ్చును. అట్లచేయలేకపోయినా మీలో మీరు భగవంతుని ప్రార్థిస్తూ గానం చేసుకోండి. అది మీ హృదయాన్ని మధురంగా మార్చుతుంది.

(స.సా. డి. 96 పు. 313, 314)||

 

తేజోమయుడైన భగవంతుని యందు మంత్ర పూర్వకమైన ఆరాధన చేత సామవేదమనే గానం చేత లీనం కావాలి. లీనం కావడానికి గానం తప్ప మరొక దారి లేదు. చాలామంది. పద్యాలు చదువుతుంటారు. మాటలు చెపుతుంటారు. కాని పద్యముల చేతమాటలచేత హృదయం ఆకర్షింపబడదు. రాముని ముందుకుపోయి "రామా నన్ను కాపాడుఅని మాటలతో చెపితే హృదయం ఏమాత్రం కరుగదు. పద్యంలో చెపితే అది కూడా హృదయాన్ని ఏమాత్రం కరిగించదు. కాని, “రా... నన్ను కా.పా.డు...అని గానం చేస్తేఅది హృదయాన్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. గానంలో ఈ విధముగా లీనం కావడానికి అవకాశముంది. కానిఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యర్థజీవులందరూ గానాన్ని వినలేకపోతున్నారు. గానంలో ఏమైనా కొంత అపస్వరం వస్తే అది భ్రష్టు పట్టిస్తుంది. ఏకాగ్రతను చెడగొట్టుకుంది. కనుకమనం పాడే సమయంలో సుస్వరంగా పాడగల్గితేనే మైకు ముందు కూర్చోవాలి. లేకపోతే మైకునకు దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది. అపస్వరంతో పాడే భజనలుఅపస్వరంతో చేసే గానము మన హృదయాన్ని కొంతవరకు చలింపజేస్తున్నాయి. నీకు పాడాలని ఇష్టముంటే ఒంటరిగా ప్రాక్టీసు చేయితరువాత మైకు ముందుకు వచ్చి కూర్చో. భగవంతుని ఆకర్షింపజేసేదిహృదయాన్ని రంజింపచేసేది గానమే. ఇదే శబ్దప్రమాణము.

(స.సా.  ఆ. 93 పు. 274)

(చూ॥ సాక్షాత్కారము)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage