ఈనాడు మానవత్వంలో రెండు తత్త్వములు ప్రధానంగా గోచరిస్తున్నాయి. ఒకటి రావణతత్త్వం, రెండవది రామతత్త్వం, రావణతత్త్వం రాగ ద్వేషాహంకారములతో కూడినది. రామతత్త్వం నిర్మల, నిస్వార్థ, నిరహంకారములతో కూడినది. రాముడు లోకకల్యాణం నిమిత్తమై తనకున్న సర్వభోగభాగ్యములను త్యజించి కారడవులలో ప్రవేశించి, రాగ ద్వేషాహంకారములతో కూడిన రాక్షసులను సంహరించాడు. కాని ఈనాటి రామభక్తులు రాముడు త్యజించిన భోగ భాగ్యములనే ఆశిస్తూ తద్వారా ఈ రాగ ద్వేషాహంకారములను మరింత అభివృద్ధి పరచు కుంటున్నారు. ఇది రామభక్తి యొక్క తత్త్వం కాదు.
(స.సా.వ.1999పు 290/291)