త్యాగం లోనే క్షేమం ఉంటున్నది. పర్వదినములన్నీ త్యాగము నిమిత్తమై ఏర్పడినవేకాని, భోగము నిమిత్తమై కాదు. భోగమునకు రోగమే స్నేహితుడు, త్యాగమునకు యోగమే స్నేహితుడు.
"భగవంతుడు నీభక్తిని చూస్తాడు కాని, నీశక్తిని చూడడు; నీ చిత్తమును చూస్తాడు కాని, నీ విత్తమును చూడడు; నీ గుణమును చూస్తాడు కాని, కులమును చూడడు; నీ మతిని చూస్తాడు కాని, మతమును చూడడు".
భగవంతుడు చిత్తాపహారి కాని, విత్తాపహారి కాదు. కాని, ఈనాడు భగవంతుని విత్తము చేత తృప్తి పర్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదియే- భక్తుని ఆజ్ఞానము! కొన్ని రకములైన forces భగవంతుని అను గ్రహమునకు పాటుపడుతున్నారు. కాని, భగవంతుడు force కు ఏనాడూ చిక్కడు, source కే చిక్కుతాడు. లోకంలో అనేక సత్కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ సత్కర్మలలో పాల్గొని సరియైన సహాయం సల్పి తద్ద్వారా సంతృప్తిని అనుభవించడమే జీవితములో సాథనగా భావించుకోవాలి.
(స.. సా.ఏ. 94 పు.97)