ఒక పర్యాయం చర్చిల్ చెప్పాడు. "Man has conquered all but he has not conquered himself అన్నాడు. మానవుడు అన్నింటిని సాధిస్తున్నాడు. అన్నింటిని అనుభవిస్తున్నాడు. తనను తాను సాధించుకోలేనటువంటి వాడు. ఎన్ని సాధించి ఏం ప్రయోజనం? ఇదే విధంగా ఆనాటి బాలుడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. “నాయనా! పంచభూతములను హస్తగతం గావించుకొని ఆడుకొంటున్నావు. కాని నిన్ను నీవు జయించుకోలేక పోతున్నావు. ప్రపంచాన్నంతా సాధిస్తున్నావుగాని, నిన్ను నీవు సాధించుకోలేనటువంటి వాడవు ప్రపంచాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి? అన్నింటిని సాధిస్తున్నావు. కాని ఇంద్రియాలను నివు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. నీ మనసును నీవు స్వాదీనంలో పెట్టుకోలేకపోతున్నావు. అది లేనప్పుడు ఎన్ని సాధించి ఏం ప్రయోజనం?" అన్నాడు. కనుక మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి. ఇది ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్యమార్గంలో ఇది స్వాధీనంకాదు.
(శ్రీ.ఆ 98 పు. 13)