ఈనాటి విద్యార్థులు వాక్ శక్తిని, మనో శక్తిని సాధించడానికి తగిన కృషి చేయాలి. అనేక పర్యాయములు నేను చెపుతుంటాను Talk less, study more. Study అంటే ఏమిటి? మన దివ్యమైన శక్తిని ఎడ్యుకేషన్ గా మార్చుకోవాలి. Values for Education: Education for Life: Life for Love; Love for Man; Man for Service: Service for Spirituality, Spirituality for Society, Society for Nation; Nation for World; World for Peace.
దీనిని మీరు చక్కగా గుర్తించాలి. విద్య జీవిత పరమావధికే కాని, జీవనోపాధికి కాదు. విద్య అనేది జీవనోపాధికి కాదు. విద్య అనేది జీవనోపాధికే అని అనుకుంటే ఏ విద్యలూ నేర్వని పశు పక్షి మృగాదులు కూడా జీవిస్తున్నాయి కదా! కనుక, Education for Life(విద్య జీవితం కొరకు), Life for Love (జీవితం ప్రేమ కొరకు) ఈ Life లో Love అనేది లేకపోతే అది Living death తో సమానం . Love is God, Live in Love. ఐతే, ఈ Love (ప్రేమ) దేనికోసం? మనిషి కోసం ( for Man) మనిషికి ప్రేమయే ప్రధానం. ఇంక మనిషి దేని కోసం? తిని, నిద్రించి, ఇంద్రియలోలుడై పశువుగా మారటానికి కాదు. Man for Service (మనిషి సేవ కొరకు). ఈ సొసైటిలో జీవిస్తూ అనేక విధాలుగా ఉపకారముల నందుకొంటున్న మానవుడు దానికి తగిన ప్రత్యుపకారం చేయనక్కర లేదా? కృతజ్ఞత చూపనక్కర లేదా? కనుకనే, Man for Service. ఇంక Service for Spirituality (సేవ ఆధ్యాత్మికత కొరకు). ఈ Spirituality (ఆధ్యాత్మికత) అనేది అమృతత్వాన్ని అందిస్తుంది.
ఈ సేవయే Spiritualityగా మారిపోతుంది. Spirituality for Society (ఆధ్యాత్మికం సమాజం కొరకు) Society for Nation (సమాజం దేశం కొరకు). ఈ సమాజం మన దేశం కోసమే ఉన్నది. కనుక, ఈ పాసైటీ దేశాభివృద్ధికై, దేశ సౌభాగ్యానికై పాటు పడాలి. Nation for World (దేశం ప్రపంచం కొరకు). ఈ Nation అంటే ఏమిటి? అన్ని అంగాలూ చేరినప్పుడే మానవ దేహము ఏర్పడినట్లుగా, అన్ని దేశాలు చేరినప్పుడే ఇది ప్రపంచమౌతుంది. ఈ ప్రపంచం (World) దేని కోసం? ఏదో క్షణ భంగురమైన జీవితాన్ని గడుపుటకే ఇంత పెద్ద వ్యర్థంగా ఏర్పడిందా? కాదు, కాదు. World for Peace (ప్రపంచ శాంతి కొరకు). అందు చేతనే, "శాంతి: శాంతి: శాంతి" అని అంటుంటాము. ఐతే.దీనిని మూడు పర్యాయములెందుకు చెప్పాలి? రెండు పర్యాయములే చెప్పవచ్చు కదా...! లేక, నాల్గు పర్యాయములు చెప్పవచ్చు కదా...! కాదు.కాదు, దీనిని మూడు పర్యాయములే చెప్పాలనేది ఒక ప్రధానమైన నిర్ణయం. ఎందుచేత? ఒకటి ఆధిభౌతిక శాంతి, రెండవది ఆధిదైవిక శాంతి, మూడవది ఆధ్యాత్మికశాంతి. ఈ మూడింటి యందూ శాంతి ఉండాలి. శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతుల నిమిత్తమై - "శాంతి: శాంతి: శాంతి:" అని చెప్పారు.
(స. సా.. ఏ. 94 పుట 105/106)