మీరు ఏ పనిచేసినా పరిపూర్ణంగా భగవంతునికి తృప్తికరంగా చేయాలి. అప్పుడే ఆపని సార్థకమౌతుంది. భగవంతుడు ఏపని చేసినా పరిపూర్ణంగా చేస్తాడు. నేను భక్తులకు ఉంగరాలను సృష్టించి ఇస్తుంటాను. నేను ఎవరికి ఇచ్చినా అది వారి వ్రేలికి సరిగ్గా సరిపోతుంది. కొలత తీసుకుని తయారు చేసే గోల్డ్ స్మిత్ కూడా పొరపాటు చేయడానికి అవకాశముందిగాని, భగవంతుడనే లైఫ్ స్మిత్ ఏది చేసినా ఫర్ఫెక్ట్ (పరిపూర్ణం) గా ఉంటుంది. అట్లే మీరు కూడా ఏది చేసినా పరిపూర్ణంగా చేయాలి. చేయించుకున్నవారు తృప్తిపడాలి, చేసే వారికి తృప్తి కల్గాలి. అదియే విజమైన పేవ. అలాంటి సేవల్లో ఉన్న ఆనందం మరి దేని యందూ లేదు.
(స. సా. న. 2001 పు. 344)