ఆనందప్రాప్తి, మోక్షప్రాప్తి చేకూరవలెనని నోటిలో పలుకుచూ, కాగితముపై వ్రాసినంత మాత్రాన ఫలితం ఉండదు. దానికి క్రుంగి. “అయ్యో. స్వామి అనుగ్రహించలేదు" అని నిరాశకు చోటిచ్చిన లాభం లేదు. స్వామి అనుగ్రహమును సంపాదించే నిమిత్తం సాధన సలుపవలెను. స్వామి హృదయం నవనీతము వంటిదే, సరే! కాని, వెన్న అయినా కరగవలెనంటే, కొంచెం వేడి చూపించవలెను కదా! ఏమిటా వేడి? హృదయావేదన. భగవత్ కటాక్షముమ, కరుణను పొందవలెనన్న ఆవేదన తో పిలువవలెను.ఆవేదనయే భగవంతుణ్ణి కరిగించి కదిలించే శక్తి గల వేడి. ఎన్ని నవరాత్రులు, ఎన్ని శివరాత్రులు గడచినాయో! ఇంకా మీలో ఆ వేడి బయలుదేరలేదంటే, జీవితమునే ఒక నిరంతర రాత్రిగా గడుపుతున్నారన్నమాట. రాత్రి జీవితమును త్యజించి, జయించి నిరంతరం పగటి జీవితమును గడుపవలెననే ఆశతో సాధన చేయండి.తేజోవంతమైన జీవితమే పగటి జీవితము. అదే యోగుల జీవితము.
(స.సా.మే 2002 వెనుక కవరు పుట)