హృదయము (Heart)

సమస్త సంకల్పములు హృదయమునుండే ఆవిర్భవిస్తున్నాయి. హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మనపలుకులు, మన చేష్టలు, సర్వమూ మధురంగానే ఉంటాయి. మన హృదయం పవిత్రంగా, నిర్మలంగా ఉంటే మన ఆలోచనలు, మన కర్మలు కూడా పవిత్రంగా, ఆదర్శంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి యొక్క హృదయమనే పుష్పము నుండి ఆనందమనే సుగంధము వెలువడుతుంది. అట్టి హృదయం పరిపూర్ణంగా ఉంటుంది. క్షీరసాగరమైన మన హృదయాన్ని ఈనాడు క్షారసాగరంగా మార్చుకుంటున్నాము. క్షీరసాగరంలో విష్ణువు పవ్వళించేడు. అది క్షారసాగరంగా మారితే తిమింగలాలకు నిలయమవుతుంది. క్షీర సాగరమైన మానవ హృదయాన్ని క్షార సాగరముగా మార్చి నిర్మలమైన మన హృదయాలను కలుషితము చేయకండి. క్షీరసాగరమంటే పాలసముద్రం. పాలు తెల్లగా ఉంటాయి. అనగా హృదయం నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలమైన హృదయంలోపల క్షీరసాగరుడు పవ్వళిస్తాడు. అతనే విష్ణువు. సర్వ వ్యాపకుడైన హృదయవాసిగా ఉంటాడతడు. కావున మీ హృదయం క్షీరసాగరము. దానిని క్షారసాగరముగా మార్చుకోకండి.

(దే.యు. పు.27)

 

హృదయమనే దానికి సరియైన అర్థ మే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టటానికి వీలుకాదు. నీలో ఏ హృదయముందో ఎదుట వానియందు అదే హృదయ ముంది. నీ యొక్క ద్వేషియందు కూడను ఇదే హృదయమే వుంది. సర్వులయందు ఒకే హృదయమే ఉంటుండాది. సర్వులయందు ఒకే హృదయముండినప్పుడు సర్వుల భావములు ఒక్కటి గానే రావాలి కదా. ఈ భావములు మనః కల్పితములు. విద్యార్థులారా! ఈ భేదము యీ భావములు ఈ చర్చలు అన్నీ మనస్సు లో వచ్చినవేకాని హృదయముతో వచ్చేవి కావు. Heart అంటే Physical heart ఒకటి వుంటుందిది: Spiritual heart ఒకటి వుంటున్నది. Heart అంటే Physical heart కి సంబంధించినది కాదు. ఇది Spiritual heart ఇది సర్వత్రా వుండినటువంటిది. దీనికి రూపము లేదుగాని అన్ని రూపములు తానే. "సర్వతః ప్రాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ సర్వతః శృతిమల్లోకే సర్వమానృత్య తిష్టతి" అన్నింటిలోను తాను ఏకమై వుంటున్నాది.ఏవిధంగా అంటే చక్కెర పాకము చేసి దానిలో ఏనుగు - కుక్క నక్క పులి గాడిద గుఱ్ఱము అని అన్ని విధములుగాప్రింటు కొట్టి పెట్టాము. చిన్న పిల్లలంతా వచ్చి నాకు కుక్క కావాలి. నక్క కావాలి పులి కావాలి ఏనుగు కావాలి సింహం కావాలి. అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని భుజిస్తారు. ఆ పిల్లల దృష్టిలోపల యివి వివిధమైన జంతువులుగా కనుపిస్తున్నాయి. గాని చక్కెరలో యీజంతుస్వరూపమే లేదు. చక్కెరలో ఎట్టి భేదము లేదు. అదే హృదయము.

 

ఈ భేదములన్నియు మానసిక ప్రతిబింబములే ఒకరిని నీవేద్వేషిస్తున్నావంటే అది నీయొక్క ప్రతిబింబమే. ఒకరినిప్రేమిస్తున్నావంటే అది నీ ప్రతిబింబమే. ఒకరిని హాస్యము చేస్తున్నావంటే అది నీ ప్రతిబింబమే. కనుకనే నీయొక్క Reaction, Resound, Reflectionsయీజగత్తునందు స్వరూప స్వభావములుగా కనుపిస్తున్నాయి. ఈ Reaction Rasound, Reflection ను విసర్జించి Reality అనే హృదయాన్ని పట్టుకొంటే యీభావములు, భేదముల ఏమాత్రము కలుగవు.

(బృత్ర.పు.151/152)

 

మీ హృదయమే ఒక పెద్ద Lock. అది ఏ Keys తో తెరవటానికి వీలుకాదు. అది చాలా భద్రమైనది. మన మైండు దీనికి Key ఈ మైండు అనే Key నిహృదయమనే Lockలో పెట్టి Right Side Turn చేస్తే, open అవుతుంది. Left Side Turn చేస్తే, Lock అవుతుంది. అదే విధముగనే మనము ప్రపంచము వైపునకు Turn చేస్తే, Attachment అనగా బంధన, దివ్యత్వము వైపునకు Turn చేస్తే, ఇది Detachment కనుక Attachment, Detachmentలకు  Turning difference. Same Lock and Same Key మనము Out look లో పోతున్నాము. కాబట్టి అంతా బంధనలో పడిపోతున్నాము. ఆంతర్దృష్టిని మనము అభివృద్ధి చేసుకోవాలి. ఇదే నిజమైన చదువు. ఈచదువుతోబాటు మనకు ఈ లౌకిక విద్య అవసరమే. ఈ చదువులు చదువకూడదని చెప్పటం లేదు. ఏది చేసినప్పటికిని, నీవు శ్రద్ధగా చెయ్యాలి. ప్రతి పని ప్రేమలో చెయ్యాలి. "నా కిష్టమైన పని మాత్రం ప్రేమతో చేస్తున్నా నంటే ఇది సరియైన సమాధానము కాదు, సరియైన పనికాదు. ఏ పనిచేసినా శ్రద్ధగా చెయ్యా లి. ఏపనిచేసినా ఒక సాధన క్రింద, దైవార్పితము క్రింద చెయ్యాలి.

(స. సా.జూన్ 91పు.146)

(చూ|| కైలాసం, క్షేత్రములు. దేవాలయము. నేనే, పరిశుద్ధము, ప్రథమ కర్తవ్యం. ప్రథమస్థానము, భద్రము, శాంతము, హిమాచలం, హిరణ్యగర్భుడు )

 

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage