హృదయమందు ప్రేమ పంటను పండించు కొనువాడే నిజమైన క్రిష్టయన్: వాడే నిజమైన సిక్కు: వాడే నిజమైన హిందువు. కానీ మానవుడు హృదయంలో ప్రేమ విత్తనాలనే నాటుకోవడం లేదు. ఇంక, పంట ఎట్లా పండుతుంది? ఇటీవల విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు హిందూ అంటే అర్థ మేమిటి? అని అడిగాను. "స్వామీ! హిందువంటే దయతో కూడినవాడు, ధర్మాన్ని ఆచరించే వాడు, దానం సల్పేవాడు" అని అనేక ఆర్థాలు చెప్పుకుంటూ వచ్చారు. హిందూ అనే పదానికి ఆంగ్ల భాషలో స్పెల్లింగ్ ఏమిటి? అని అడిగాను. HINDU అని చెప్పారు. అప్పుడు నేను చెప్పా. H-Humanity (మానవత్వం ): - Individuality (వ్యక్తిత్వం ): N-Nationality (జాతీయభావం): D-Divinity (దివ్యత్వం ): U-Unity (ఐకమత్యం) ఈ ఐదు లక్షణములతో కూడినవాడే హిందువు" వీటన్నిటియందూ అంతర్వాహినిగా ప్రవహించు నటువంటిదే ప్రేమ. ఇట్టి ప్రేమతత్త్వాన్ని పండించు కొనువాడే నిజమైన హిందువు. ఇంక ముస్లిం అనగా ఎవరు? శాంతంగా జీవితం గడిపేటటువంటివాడే ముస్లిం. శాంతం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? హృదయం ప్రేమతో నిండినప్పుడే శాంతం ఆవిర్బవిస్తుంది. కనుక ప్రతి జాతియందు, ప్రతి మతమునందు, ప్రతి వ్యక్తియందు హృదయం ప్రేమమయం కావాలి. ప్రేమనే శివం అన్నారు. అదే మంగళం. ప్రేమ ఎప్పుడూ ఎవ్వరిని బాధించదు. బాధించనటువంటిదే మంగళకరమైనది. అదియే శివత్వం. ప్రేమతో కూడినవాడే శివస్వరూపుడు:ప్రేమలేనివాడుశవస్వరూపుడు
(స.సా.మా.99పు.60)
ఈనాటి మానవుడు తనయందున్న దోషాన్ని తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. పరులయందు ఉన్నటువంటి లేని దోషాలను కూడా వెదకటానికి సహస్ర నేత్రములతో చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదియే ఈనాడు మానవత్వంలో చేరినటువంటి మాలిన్యం.పవిత్రమైనటువంటి హృదయంలోపల అపవిత్రమైనభావములను చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యం ఈ రూపాన్ని ధరించింది.
ప్రపంచంలో ఎక్కడ చూచినా ఒకరినొకరు దూషించు కోవటమే; ఒకరినొకరు విమర్శించుకోవటమే. ఒకరిలోన్ను తప్పులు మరొకరు వేలెత్తి చూపటమే. తప్పులు వెదకేవారే కనపడుతున్నారుగాని మంచిని వెదికే మానవులు కనిపించటం లేదు. మంచిన వెదికేవాడే విజమైన మానవుడు. "హృదయమునందు ప్రేమపంటను పండించుకొనేవాడే, వాడె క్రైస్తవుండు" A Christian should be an ideal Christian. అనగా తన హృదయము నందు ప్రేమ పంటను పండించుకోవాలి. అతనే నిజమైన క్రైస్తవుండు. సిక్కులనగా ఎవరు? టర్బన్ పెట్టుకొని కత్తిగల వారు మాత్రమే కాదు. తన హృదయమునందు ప్రేమ పంటను పండించుకున్నవాడే నిజమైన సిక్కు. పరులమ చంపటం, పరులను హింసించటం సిక్కుల లక్షణం కాదు.
ఇక హిందువెడెవరు? హృదయమునందు ప్రేమపంటను పండించుకొనువాడే హైందవుడు" కాని ఈనాడు ఆప్రేమపంట ఎక్కడా కనిపించటం లేదు. ప్రేమ విత్తనాలకు కూడా నాటటం లేదు. ఇంక పంట ఎట్లా పండుతుంది? ప్రేమ లేని మానవడు “హిందు" అని చెప్పటానికి ఎలా సాధ్యమవుతుంది. ప్రేమతత్త్యమును పండించుకొనకుండా నేను హిందువుని. హిందువుని అనుకుంటే ఏమి ప్రయోజనం? ఇంక ముస్లిం. ఇతను కూడా ప్రేమ పంటను పండించుకొనువాడే. వీరు అల్లా అని పిలుస్తారు. అల్లా అనగా దేవుడు. అల్లాహా అక్బర్" అనగా దేవుడు గొప్పవాడు. శాంతంగా జీవితాన్ని గడిపేటటువంటివాడే "ఇస్లాం . ఈ శాంతం మనలో ఎప్పుడుప్రారంభమవుతోంది? ప్రేమతో హృదయము నిండినప్పుడే మనలో శాంతం ఆవిర్భవిస్తుంది. కనుక ప్రేమలేకుండా శాంతిలేదు. కనుక ప్రతి జాతి యందు. ప్రతి మతమునందు ప్రతి వ్యక్తియందు ప్రేమ మయమైనటువంటి హృదయం కావాలి..
(శ్రీమా.99పు.4/5)
(చూ|| మానవుడుకాడు)