అమానిత్వము అనగా అభిమానము లేకుండుట. మానమున్నంత వరకూ జ్ఞానము కలుగదు. మానవుని వృత్తులు నీటివలె వుండవలెను. అంటే నీటిలో యేరంగుచేర్చిన నీరు ఆ రంగుగా మారును, ఆ రంగులో నీరు చేరి పోవును. వీటికి అభిమానము శూన్యము. మానవుని ప్రవృత్తి దీనికి పూర్తిగా విరుద్దము. ఏ చిన్న ఉపకారమో, యే కించిత్ దాన ధర్మమో చేసిన అది పదిమందికీ తెలియ వలెను. అట్లు తెలియుటకు వీలులేకున్న తనకు తానైననూ చెప్పుకొని తిరుగును. లేక ఏ పేపర్లలో నైనా వేయించుకొనును ఇట్టి అభిమానము లేకుండుటే అమానిత్వము.
(గీ.పు. 206)