"నేను అనాథను" అనడానికి బదులు, మొరటు మాటలలో "నేను అనాదిని"అ ని బిచ్చగాళ్లు మీ వాకిళ్ళలో నిలబడి అనటం మీరు విని ఉంటారు. తనకు దిక్కు లేదని చెప్పబోతూ తనకు మొదలు లేదు అని అంటారు. తనకే కాదు. మీ అందరికీ మొదలు లేదనే పరమ రహస్యం అతను వెల్లడిస్తున్నాడు.
"భిక్షాం దేహి" అన్నప్పుడు బిచ్చం వెయ్యి మనడమే గాక శరీరంలో ఉన్న "దేహి"ని సంభోధిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. దేహి ఆంటే ఆత్మ - మీరు శరీరంలో ఉన్న ఆత్మ స్వరూపులు. తానూ ఆత్మస్వరూపుడే - తానూ మీరూ ఒకటే ఈ సత్యాన్ని అతను బోధిస్తున్నాడు - భ్రాంతి కలిగించే బాహ్య వేషమే యీ శరీరం. ఎప్పుడూ ఉన్న భావాలతో ఉండండి.
(త.శ.మ.పు.156)