అగ్ని ; సర్వమునకు అగ్రమున అనగా పూర్వమున సృజింపబడిన వాడు అని అర్థము. అగ్ని పరోక్షనామము. "అగ్నిర్వైదేవయోనిః" అనేదిశ్రుతి ననుసరించి అగ్ని యొక్క దేవతాత్మకత్వమును అటులనే యజమానికి కలుగుదివ్యత్వమును ఎవరు తెలిసికొనగలరో అట్టివారికి అమృతత్వము సిద్ధించును.
భోక్త, భోగ్యము అని జగత్తు ద్వివిధము. భోక్త, భోగ్వరూపమగు ఈ జగత్తు ఏకీభూతమగునపుడు, ఈ రెండింటిని కలిపి అత్తా అనియో లేక భోక్త అనియో వ్యవహారము. భోగ్యము అను వ్యవహారము వేరు.. భోక్త యెవరు? అగ్నియే హవిస్సులను గ్రహించేది.
అధి దైవికము ఆదిత్యుడు. ఆధ్యాత్మికముగ ప్రాణము. ప్రాణాన్ని ఇట్లు అగ్నియందు ఆజ్య. సోమ ఆది హవిస్సులకు "అహితయః" అని పేరు, పరోక్షముగా ఆహుతులు అని చెప్పబడినది. దేవతలు పరోక్ష ప్రియులు.
(లీ.. వా పు. 22)
ఆగ్ని - "బిడ్డా! నేను మంచి చెడ్డ వ్యత్యాసము చూడను. చెడ్డను కాల్చి నేను చెడిపోవటం లేదు. మంచిని కాల్చి అభివృద్దికి రావటం లేదు. ఈ రెండింటిని సమత్వoగానే భావిస్తున్నాను. కనుక మంచి చెడ్డలనే విచారము నీయందు ఉంచుకోవద్దు. అన్నియు భగవంతుడను గ్రహించిన ప్రసాదములే. మంచిచెడ్డలను నీవు వ్యత్యాసము చేసుకొనక అన్నింటియందు సమత్వము వహించు. ఇదియే “ఆత్మజ్ఞానము" అనింది. దీనిని పురస్కరించు కొనియే నేను అప్పుడప్పుడు చెబుతుంటాను. ప్రకృతియే మనకు పెద్ద గ్రంధము. ఈ గ్రంధము నుండి మనము ఎన్నియో నేర్చుకొనవలసినవి వున్నాయి.
(ద.య.స. 97 పు 64)
(చూ|| అధర్వవేదము, ఋగ్వేదము, పంచభూతములు, వేదము, స్వాహా)