మొట్టమొదట అసూయ మానవునియందు లేకుండా చూచుకోవాలి. ఇతరుల మంచిని చూచి, ఇతరుల అభివృద్ధిని చూచి, ఇతరుల మేలును చూచి నీవు ఆనందించు. ఇదే నిజమైన సద్గుణము. పరుల మంచిని చూచి వారి మంచిని కోరటమే సరియైన సద్గుణమని భగవద్గీత బోధిస్తూ వచ్చింది. మానవుడు అనుభవించే సమస్తదు:ఖములకు మూలకారణము అసూయనే. కనుకనే తొమ్మిదవ అధ్యాయమునందు అర్జునా నీవు అనసూయుడవు కమ్ము; అసూయుడవు కాదు అన్నాడు. అనసూయ తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా చేస్తుంది. అనసూయను పరీక్షించుటకై వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పసిపాపలుగా చేసుకుంది. అనగా మన గుణములను కూడను మనము వశము చేసుకోవచ్చును. సత్వరజస్తమోగుణములను మనము జయించవచ్చు. అనసూయవల్ల ఎంతైనా సాధించటానికి వీలవుతుంది.
(శ్రీగీ. పు. 217)
(చూ॥ అసూయ)