అనుమానమే ఆస్తికునకు అంటువ్యాధి. అనుష్టానం ఉంటే అనుగ్రహం లభిస్తుంది. అన్నింటియందు కల ఆత్మశక్తి ఒక్కటే అని తెలుసుకొనుట బ్రహ్మజ్ఞానము, మిగిలినవి కర్మ జ్ఞానము. అభిమాన శూన్యమే ఆనందనిలయం. అవివేకికి మనస్సే భూతం, వివేకికి మనస్సే దైవం. దోషంకంటే దోషములను చర్చించువాడు దోషి. దైవము పైన భక్తి, జీవుల పైన రక్తి, సేవపైన ఆసక్తి పెంపొందించండి. దేవతలు భోగస్వరూపులు, అమ్బతముత్రాగిరి. దేవుడు త్యాగస్వరూపుడు, గరళమును కంఠమున చేర్చి లోకాన్ని రక్షించినాడు.
(స.సా. ఏ 91 పు. 109)