తుల్యనిందాస్తుతి ర్మౌని సంతుష్టోయేన కేనచిత్
అనికేత స్థిరమతి: భక్తిమాన్మే ప్రియోనరః
నిందాస్తుతులకు వెరువక, నన్నే ధ్యానించి, నాయందే అకుంఠిత విశ్వాసం కలిగి పూజించువారిని రక్షించటమే నా ధ్యేయం. భక్తరక్షణే - సాయిలక్ష్యం. వారి రాక భక్తులకొరకే అనేదాన్ని ఆనాడే, తమ పదుమూడన సంవత్సరముననే ప్రకటించారు. భక్తుల ఆనందం కొరకే, భక్తులను ఆపదలనుండి రక్షించుకొరకే అవతరించారు సాయి. సాయి సల్పిన అత్యాశ్చర్య, అత్యద్భుత లీలలు యే అవతారంలోనూ కని విని యెరుగం. ‘‘ఆపద్బాంధవాయ నమః, భక్తపరాధీనాయనమః" అని, కమనీయ కుసుమము లతో సాయి కంజదళాక్షుని అర్చించి ఆరాధిస్తున్నాం. (అ.శ.నా.278)