దేవుడు హిందూకాదు. దేవుడు ముస్లింకాదు. దేవుడు క్రిస్టియన్ కాదు. మతానికో దేవుడు లేడు. దేవుడుకో మతం లేదు. అన్ని మతాలు మార్గాలు. దైవాను గ్రహం. గమ్యం. దేవుడికి కూడా మతాన్ని అంటగట్టే మతోన్మాదులే మతకలహాలకి కారణం. మతబోధకులు తమతమ మతసిద్ధాంతాలను ప్రచారం చెయ్యడంతో బాటు ఇతర మతాలను ద్వేషించడాన్ని ప్రోత్సహించడం వల్లనే మానవులు మతులు చెడి మత విభేదాలు పెంచి మానవత్వాన్ని మంట కల్పుతున్నారు. ఈ సత్యాన్ని చరిత్ర రుజువు చేసింది. ఆచారాలు ఆరాధనా విధానాలు వేరుకావచ్చు. కాని అన్ని మతాలు మంచినే బోధిస్తున్నాయి. "Be good, see good and do good అన్నదే సర్వమత సిద్ధాంతసారం. ప్రతి హిందువుని ఆదర్శహిందువుగాను, ప్రతి క్రిస్టియ ఆదర్శ క్రిస్టియన్ గానూ, ప్రతి ముస్లించి ఆదర్శ ముస్లింగానూ, అలాగే వివిధ మతస్థులను వాళ్ళవాళ్ల మతాలలో ఆదర్శమతస్థులుగా తీర్చి దిద్దడమే నా ధ్యేయం. అన్ని మతాలు దైవ పితృత్త్వాన్ని మానవ సోదరత్వాన్ని బోధిస్తాయన్న సత్యాన్ని గుర్తు చేసి సర్వమత సమానత్వాన్ని ఆచరణలో ప్రచారం చెయ్యడమే నా లక్ష్యం. .
ప్రే.బ.పు.99)
(చూ ప్రార్థన గీతము, మతబాంధవ్యము, స్వామి బాల్యము)