వేదాంత వాక్యములందు అన్ని చోట్లను ప్రసిద్ధమగు బ్రహ్మపదమునే చెప్పియుండుట వలన, ప్రస్తుత వాక్యమున కంతటికినీ గుణము కలవాడు పరబ్రహ్మమే కానీ జీవుడు కాడని కొందరు విమర్శకులు చెప్పుచు వచ్చిరి. ప్రసిద్ధమగు బ్రహ్మమే స్వరం ఖల్విదం బ్రహ్మ . ఈ కనబడునదంతయు పరబ్రహ్మమే అనునట్టి ఉపక్రమ వాక్యము నుందు ప్రయోగిపంబడియున్నది. శ్రుతి వాక్యానుసారము జగత్తు పరబ్రహ్మ స్వరూపమే. ఎట్లనగా దీని యునికి బ్రహ్మకు భిన్నముకాదు. రాగ ద్వేషాదులకు దూరముగా నుండి చూచిన సమస్త హేరురూపము బ్రహ్మమే. కాని, రాగ ద్వేషాల దృష్టితో చూచిన అంతా భిన్నమే. రాగ ద్వేషములు ఏకత్వాన్ని అనేకత్వంగా చూచును. శాంతి అనేకత్వమును ఏకత్వంగా భావించును. శాంతి రహితులైన వారు, భిన్నభావములతో పరికించుట చేత బ్రహ్మం వేరు జగత్తు వేరు అని భావింతురు. దృష్టిని బట్టి సృష్టి
(సు.వా, పు.54/55)