బుద్ధిని మధ్య మధ్య అహంకారము ఆవరిస్తుంటాది. శరీరముకంటె ఇంద్రియములు, ఇంద్రియములకంటె మనస్సు, మనస్సుకంటె బుద్ధి, బుద్ధికంటె ఆత్మ మరింత సూక్ష్మమైనవి. సూక్ష్మమైన బుద్ధిని అహంకారము ఆవరించినదంటే అహంకారము బుద్ధికంటె సూక్ష్మమైనది. ఇది సర్వత్రా ప్రవేశిస్తుంది. సర్వకర్మలయందుప్రవేశిస్తుంది. కనుకనే మానవుడు ఈ అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
(బత్ర.పు.94)
(చూ॥ పంచభూతములు, స్మరింతురు)