భూమి మీద ముండ్లు రాళ్ళు అసలు లేకుండా ఎవరు చేయగలరు? చేయలేరు. చెప్పులు వేసుకొని వాటి బాధనుండి తప్పించుకొన ప్రయత్నించ వలనే కానీ వేరు మార్గముండదు. వేదాంత దర్శనము, సత్యదృష్టి చేత, స్వస్వరూప బ్రహ్మ దృష్టిచేత, సత్యస్వాతంత్ర్య ధర్మమును పొందవచ్చునని తెలుపుచున్నది. బాహ్మ పరివర్తనాలు తాత్కాలిక కోప శమనోపాయాలు మాత్రమే. సర్వవిధ దాస్యములకూ సంబంధించిన దేహమునకు నేను బానిసను కాను. ఈ దేహము నా బానిస నేను సర్వ నియంతయు ముక్తి స్వరూపుడును అనే నిత్య సంభావనలతో ఎవడు అహంభావాన్ని కాలరాస్తాడో అతడే విముక్తుడు. ధర్మములు అహంకార బంధ విముక్తికి దారి తీసేవిగా నుండవలెను. ధర్మము. అహంకార వికార ప్రేరితాలు కాకూడదు. ఇదే సూత్రము. ఇదే స్వతంత్రము.
(థ.పు.14/15)
(చూ॥ జగదీశుడు)