భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనేవి ప్రధానమైన వాక్యములు. ఈనాడు మనం మన తల్లిదండ్రులకు సంతృప్తి కావించినప్పుడే మన బిడ్డలు మనకు సంతృప్తి కావించటానికి పూనుకుంటారు. ఈనాడు కాలేజీలో విద్యార్థినులుగా ఉన్నవాళ్లు రేపు మాతృమూర్తులుగా తయారవుతారు. కనుక రేపు మాతృ మూర్తులుగా తయారే ఈనాటి విద్యార్థినులు ఈనాటి తల్లిదండ్రులకు తగినట్లు సంతృప్తి కావించే నడకను నేర్చుకోవాలి. స్త్రీకి ప్రధానమైన స్థానాన్ని అందించి మన భరతమాత యొక్క క్షేమాన్ని, సంస్కృతిని విశిష్టతను నిలబెట్టుటానికి విద్యార్థినులు పూనుకోవాలి. గృహలక్ష్మి, ఇల్లాలు ధర్మపత్ని అనే సార్థక నామములు గైకొన్నటువంటి . ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రకటించుటకై ప్రచార కార్యక్రమానికి పూనుకోవాలి.
గృహిణి యొక్క కర్తవ్యాన్ని స్త్రీ నిర్వహించాలి. దేశముయొక్క కీర్తి అపకీర్తులకు స్త్రీలే కారణం. కనుకనే దేశం యొక్క పేరే మాతృభూమి, ఇంతియే కాదు మన చరిత్రయందున్న పావనమైన పురుష దేవులు సీతా రామ, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, పార్వతి పరమేశ్వర! దీనిలో స్త్రీల పేర్లు ప్రథమంలో కనిపిస్తూ ఉంటాయి. ఇట్టి ప్రథమ స్థానమునలంకిరంచినటువంటి స్త్రీలు సక్రమమైన ధర్మమును ప్రచురించుట కొరకు సత్యసాయి కాలేజిలను స్థాపించటమైనది.
(ససా. జూ .75పు. 95)