సచ్చిదానంద

సచ్చిదానంద స్వరూపునకు అన్నిరూపులు తానే, అంత యూ తానే కాదా?కాన త్రికాలములందు మారనటువంటి పరమాత్మ ఏదో అదే నీవు కాని మారునట్టి దేహము మాత్రము నీవు కాదు, ఈ భావన తెలిసికొని నిరంతరమూ నేను పరబ్రహ్మ స్వరూపుడనని ఎవరు తలంతురో వాడు జ్ఞాని, మనసు ఎంతవరకు వస్తువునందు మనుష్యుని యందు స్థలమునందూ ఆసక్తి కలిగియుండునో అది బంధన, వాటి వేటిని అంటకుండు స్థితి యుండుటే ముక్తి, కావున అనురాగమే బంధన, మృత్యువు విముక్తియే శాశ్వత జీవితము.

"మనయేవ మనుష్యాణామ్ కారణం బంధమోక్షయోః"

అన్నట్లు మనస్పే మానవుని బంధనకు స్వాతంత్ర్యమునకు కారణము, ఆసక్తియే రాగము, అట్టి ఆనురాగమే కర్మకు కారణము. అనురాగమే ఇంద్రియములను చలింపజేయు చున్నది.

భయము, క్రోధము, అనురాగము యొక్క మొదటి స్నేహితులే కాక, ముఖ్య స్నేహితులు కూడను, ప్రాణ స్నేహితులు. అనురాగ మెక్కడున్నదో క్రోధము, భయము. అక్కడే యున్నవి. ప్రక్కనే యున్నవి. అందుకనే పతంజలి కూడను రాగమునుగూర్చి ఈ క్రింది రీతిగా తెలిపెను.

సుఖానుశయీ రాగః సౌఖ్యమును ఆకర్షించుటకు కారణము ఆసక్తియే.అని చెప్పియున్నారు. ఏది సౌఖ్యమో అది అంతయు అనురాగము. విషయముల వంటి యుండుటచేత ఆసక్తి ఏర్పడుచున్నది. ఆసక్తి ద్వారాకోరికలు పుట్టుచున్నవి. కోరికల నుండి క్రోధము; వాటి మూలమున సుఖదుఃఖములు, మంచి చెడ్డలను చక్రమున ఇరుకుకొని తపించుచుండుటే ఆజ్ఞానము.

 

బాగుగా కాల్చిన బంగారమునందున్న మాలిన్యము పోయి ధగధగ మెరయునో, ఆట్లేగాఢమైన వివేకముచే విచారణచే రాజస, తామసములను భ్రాంతులు, వాంఛలు క్రోధములు, అను మాలిన్యము పోయి ఆత్మజ్ఞానమును ప్రకాశమును దర్శింపగలరు. తీవ్రమగు గాలి దుమారముచేత చెదిరిపోయిన నల్లని మబ్బులవలె వాసనలను సంకల్పములను తృష్ణలను నిర్మూలించిన వెనుక మనసు పరబ్రహ్మైక్యము కాగలదు. ఎట్టి కష్టసమయములందును మనసును జారవిడువరాదు. ఉన్నత దృష్టిచేత మనసును అరికట్టవలెను. పవిత్ర అంత:కరణములతో కలిమి చేసికొని ఆత్మను శరణుజొచ్చవలెను. అప్పుడు సవికల్ప సమాధినుండి నిర్వికల్ప సమాధిలోనిక పోగలరు. పూర్తి నిర్మోహము కలిగినప్పుడే నిర్వికల్ప సమాధి లభించును. అదే సంపూర్ణ ఆత్మజ్ఞాన ముదయించుటకు పునాది, నిర్వికల్ప సమాధి ద్వారా పరబ్రహ్మము చేరగలిగినప్పుడే అవిద్య, కర్మ, కామము మొదలగు బంధనలను తెంచి వేయవచ్చును. సమాధిలో లగ్నము చేయబడిన మనస్సుతోనే ఆత్మ సందర్శనము సాధ్యము.

బ్రహ్మజ్ఞానమును అనుభవించుటకు ప్రయత్నించేవాడు దేహమందు భ్రాంతి పూర్తిగాపోయి దానిని. పాము విడుచు కూసమువలె నిర్లక్ష్యముగా చూడవలెను.

(జ్ఞానాపు.21/23)

(చూ॥ ఆనందమయుడవు, సత్యం శివం సుందరం)

            


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage