సగుణ నిర్గుణములు భగవంతునకు పాదముల వంటివి. దానికి అది ప్రధానమే. ఆధారమే, ఒకటి శ్రేష్టమనియూ మరొకటి శ్రేష్టము కాదనియూ చెప్పవీలులేదు. అయితే కుడి యెడమలని మాత్రము చెప్పక తప్పదు; సగుణముయెడమకాలనియూ, నిర్గుణము కుడి కాలనియూ చెప్పవచ్చును. ఏ మంగళ కార్యమునందయినా కుడికాలుమొదట పెట్టినటుల, మోక్ష సాథమునకు నిర్గుణమము కుడికాలును మొదట పెట్టవలెను! అదే మంగళము. అనగా మోక్షసాధమునకు నిర్గుణుడు మొదట ప్రవేశించును తరువాత సగుణుడు ప్రవేశించును. ప్రవేశము ఇరువురికీ కలదు. అట్లు లేదని చెప్పుటకు వీలులేదు. ఎవరైననూ ఒక పాదము లోపల, మరొక పాదము వెలుపల, ఎంతసేపని పెట్టుకోగలడు! ఆట్టుండిననూ యేమి ప్రయోజనము! కాన సగుణ భక్తిని సాధనంగాను, నిర్గుణ భక్తిని సాధ్యంగామా తలంచవచ్చును. అనగా నిర్గుణునకు విశ్వమంతయు విశ్వేశ్వరుని వలే కమపించ వచ్చును. సగుణుడు విశ్వము వేరుగాను, విశ్వేశ్వరుని వేరుగానూ తలంచవచ్చును. చూడవచ్చును. ఈ రెండునూ లక్ష్యార్థమున చూచిన ఒక్కటియే. ఎట్లన కొన్నిచోట్ల దారముగా వున్న వస్తువే మరొకచోట వస్త్రముగా కనిపించును. వస్త్రము వేరు, దారము వేరుగా ఉండును కానీ, దారమే వస్త్రము, వస్త్రమే దారము. చారమును వేరుగా, వస్త్రమును వేరుగా, చూచుట సగుణోపాసన తత్త్వము, దారము యొక్క సమ్మేళనే వస్త్రమని రెండిటినీ యేకముగా చూచుటే నిర్గుణనియొక్క తత్వముగా భావించవలెను.
(గీ. పు.192/193)