సంస్కృతి అంటే సంస్కారము నుండి వచ్చేది. ఈ సంస్కృతియే మన ధర్మము. ధర్మంటే ఏమిటి? దీనిని మానవులందరు ఉచ్చరిస్తుంటారు. కాని దానిని యెవరూ ఆచరించడానికి, నిరూపించడానికి, సాహసించడం లేదు. ధర్మమంటే కేవలము నేను క్షేమముగా ఉండాలి, నాకుటుంబము క్షేమముగా ఉండాలి అనుకోవడం కాదు. దానికి కావలసిన కర్తవ్యకార్యములు చేయడం. ఇదే ధర్మం అనుకుంటున్నాము. మన లౌకిక జీవితములోఆచరించే ఏవో కొన్ని నిబంధనలకు గురియైన కర్మలు, ధర్మమని అనుకుంటున్నాము. ఇది చాలా పారపాటు. "ధార ఇతి ధర్మః" - ధరించినటువంటిది ధర్మము.హృదయం వరించి నటువంటిది ధర్మం. మనసును కరిగించినటువంటిది ధర్మము. సమత్వమునుప్రేరేపించునది ధర్మము. నిత్యత్వాన్ని కలిగేటటు వంటిది ధర్మము, సత్యమే ధర్మమునకు పునాది. అందువలననే “సత్యం నాస్తి పరో ధర్మ:” అన్నారు. ధర్మమనే భవనానికి సత్యము పునాది. సత్యం అనేటటువంటిది మారేది కాదు. కదిలేది కాదు. మనల్ని వదిలేది కాదు. "లోకా: సమస్తాస్సుఖినో భవంతు" ఇది మానవ ధర్మము. దీని అర్థమేమిటి? తనవారు, పరులు, అనే భేదము లేకుండ తన గ్రామము వారే కాదు, రాష్ట్రమువారేకాదు, యావత్ప్రపంచము క్షేమంగా ఉండాలనుకునే తత్త్వమును గ్రహించునట్టిది ధర్మము. అంతేకాని స్వార్థము సమసరించేది కాదు ధర్మము. పవిత్రమైనటువంటి, విశాలమైనటువంటి దివ్యతేజోపుంజముతో కూడిన దైవత్వానికి చేర్పించేదే ధర్మము.
(శ్రీది. పు.41/42)
వృద్దులైనవారు ప్ర యాణము చేయవలనదూరముకొంచెమే: కానీ పసివారు చాలా దూరము ప్రయాణము చేయవలసి ఉన్నదని గర్తుంచుకొనండి. వారే జాతిని, ఆటు నరకములోనికో యిటు స్వర్గములోనికో, తీసుకొని వెళ్లుతారు. నేటి సంక్షోభ సంఘర్షణలలో, మన సంస్కృతి శాంతి భద్రతల నందివ్వగలదని మన ప్రాచీన ఋషులు చక్కగా గుర్తెరిగి ఉన్నారు. అందుచేతనే వారు, పిన్నలకు పెద్దలకు ఉపదేశత్రయమును నిర్ణయించినారు. ఈ ఉపదేశములే "మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్య దేవోభవ" ఈ ఆదర్శముల నాధారము చేసికొని జాతి పురోగమించు చున్నంత వరకు. దాని నెవ్వరూ వ్రేళ్ళలో పెకిలించి నశింప చేయలేరు. తల్లి, తండ్రిని గురువును దైవసమానులుగా గౌరవించి ఆదరించు చున్నారనగా ఆ మహాయోగిపుంగవులు మనకందించిన పవిత్ర వారసత్వమును నేటి తరమువారు ఆదరించుచున్నారని అర్థము .
(స.సా.ఏ.75 పు.31)
సంస్కృతియే లేకుండిన మానవజీవితమే లేదు. It is a way of life. దీనిని ధిక్కరించి పెడమార్గమును అనుసరించుచు మనము శాంతి భద్రతలకు దూరమై పోతున్నాము. ప్రతివ్యక్తి సుఖము సుఖమనే దానిని ఆశిస్తున్నాడు. సుఖమంటే యేమిటో గుర్తించటానికి ప్రయత్నించటము లేదు. దినమునకు నాలుగు పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, మూడు పర్యాయములో లేక నాలుగు పర్యాయములో టెలివిజనో, సినిమాయో చూడటము, ప్రపంచమునే మరచి వుండటము. సుఖముగా భావిస్తున్నారు. తినటము త్రాగుటము నిద్రించటము ప్రపంచమున మరచటము దీనికి మానవునిగా పుట్టవలసి వచ్చిందా? పసుపక్షి మృగాదుల తినటం లేదా? నిద్రించటం లేదా? ప్రపంచాన్ని మరచటం లేదా? ఇంతమాత్రానికి మానవుడుగా జన్మించటానికి అవసరమేమి వచ్చింది? “జంతూనాం నరజన్మదుర్లభమ్ అట్టి ఉత్తమమైన మానవత్వమును ఈనాడు మనము మరచిపోతున్నాము. మన సంస్కృతి యేమిటో గుర్తించటానికి ఏమాత్రము ప్రయత్నించలేక పోతున్నాము. భారతీయ సంస్కృతియందుజీవనోపాధి మాత్రమే కాక జీవితపరమావధి తత్వాన్ని చక్కగా వర్ణించి వివరించి బోధించిన దివ్యమైన భావములున్నవి. సంస్కరింప బడినదే సంస్కృతి. ఈ సంస్కృతి సంస్కృతము నుండి ఆవిర్భవించినది. ప్రపంచమునందు సహజముగా ఆవిర్భవించిన ప్రతిపదార్ధమును సంస్కరించిన తరువాత అనుభవించునదే. ఒక చిన్న ఉదాహరణము. మనము నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. ఐతే బియ్యము భుజించే యీస్థాయికి రావటానికి పూర్వము ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితోనున్న వడ్లను వేరు చేయటము. ఆ వడ్ల పైనన్ను పొట్టును విడతీయటము, విడదీసిన బియ్యమును ఉడక పెట్టటము, పరిపక్వమైన పదార్థము మనము భుజించటము ఈ బియ్యము ఇన్ని రకములైన సంస్కారములు జరగటం చేతనే మనము భుజించుటకు వీలవుతున్నది. సంస్కారముచేత ఇవి తమ విలువలు పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లకు ఒక నూరు రూపాయలు మాత్రమే యివ్వగలము. దానిని సంస్కరింపచేసి దాని పాట్టును వేరు చేసి అనుభవించగలిగే యోగ్యతకు తెప్పించటం చేతనే ఒక మూట 600 రూపాయలుగా పెరుగుతుండాది. ఒక్క మూట సూరు రూపాయలుగా వుండిన వడ్లు ఒక్కమూట బియ్యముగా మారినప్పుడు 600గా పెరగటానికి ఏది కారణము? ఈ వడ్లను సంస్కరించిన ఫలితమే దానికి విలువ. మన చేతియందు ఒక గడియారము కట్టుకుంటాం. ఈ గడియారము నిప్పులో వేస్తే రెండణాలు Stainless steel మనకు చిక్కదు. కానీ ఆగడియారమునకు వేయి రూపాయలు ఇచ్చి పొందటానికి యేమి కారణము? సంస్కారమే దీనికి కారణము. దానిని సరియైన స్థితిలో మనము అనుభవించే యోగ్యంగా తీర్చి దిద్దారు. Bolts nuts screws pins గంటలు అన్నింటిని సక్రమముగా సవరించటంచేతనే సంస్కారముగా మారింది. ఇదే విలువ పెరగటం. ఇదే విధముగనే భారతీయులు ప్రాచీనకాలమునుండి ప్రతిపదార్థమును సంస్కరింపచేసి ఆనుభవిస్తూ వచ్చారు ఇది ఒక వస్త్రము. ఇది వస్త్రముగా మారటానికి ఎన్నిరకములైన సంస్కారములు పొందింది? ప్రత్తిగా వుంటుండి తదుపరి నూలుగా మారి ఈనూలు నేయటంచేత ఒక వస్త్రముగా తీర్చిదిద్దినాము. ప్రత్తిని ప్రత్తిగానే మనము అనుభవించటం లేదు. ప్రత్తిని అనేక విధములగా సంస్కరింపచేసి తదుపరి దానిని ధరిస్తున్నాము. అదేవిధముగనే మానవుడుగా పుట్టినవాడు మానవుడుగానే జీవించటము వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వముగా మనము తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగిన కృషి మనము చేయ్యాలి. కనుక విద్యార్థులకు ఈనాడు విద్యతోపాటు వినయము, వినయముతోపాటు వివేకము, వివేకముతోబాటు విచక్షణ యీరకమైన సంస్కారములచేత మానవత్వము పరిపూర్ణత్వము పొందటానికి వీలవుతుంది.
(బృత్ర.పు.5/6)
దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనది భారతీయ సంస్కృతి.
(బృత్ర.పు. 10)
(చూ॥ దైవగుణము, భారతదేశము, సత్యము )