సంసారము కదిలే మేఘాలవంటిది. పెండ్లికి ముందు భార్య ఎవరు? భర్త ఎవరు? బాటసారి చెట్టు క్రింద నీడలో కూర్చొనట్లు కొంత కాలము కలసి యుండవచ్చును. తరువాత విడిపోవచ్చును. ఈ సంబంధాలు కదిలే మేఘాలవంటివి. ఒక బాటసారి అలసిపోయి ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. అతడు హాయి అనుభవిస్తున్నాడు. కాని చెట్టుకు మాత్రము తన నీడను అనుభవిస్తున్నాడనే గర్వముగాని, అహంకారము గాని ఎంతమాత్రమే లేదు. నీడ ఇవ్వడం చెట్టు సహజ గుణము. కాని ఏ కోశానా అహంకారము లేని చెట్టు ఎప్పుడూ ఆనందముగానేయుంటుంది. జీవిత వృక్షమనే భార్య పిల్లలు, తన నీడను. తన రక్షణలోవుంటున్నారనే అభిమానము, ఆహంకారము ఉండుటవల్ల నాకు దుఃఖము కలుగుతోంది అని అనుకుంటాడు. మార్గమధ్యలో ఏర్పడ్డ సంబంధాలు యివన్నీ కొంత సేపు విశ్రమించిన తరువాత వెళ్ళిపోతాడు.
(సా.పు.36)
(చూ: తామరపువ్వు. నియమం)