అసూయచేతనే మానవుడు ఆశాంతికి గురియైపోతున్నాడు. ఒకప్పుడు బుద్ధుడు భిక్షాటనకై బయలుదేరి వెళ్ళుతున్నాడు. తాను చేరవలసిన గ్రామము సమీపిస్తుండాది. ఆ గ్రామములోపల ఆందరూ బుద్ధిని పైన అమితమైన విశ్వాసము గలిగినవారు. ఆగ్రామము సమీపిస్తుండగానే కొంతమంది దుర్మార్గులు చేరి యితనిని అడ్డగించి అనేక విధములుగా దూషిస్తూ వచ్చారు. కాని బుద్ధుడు ప్రయాణము చేయకుండా ఒక రాలిపైన కూర్చున్నాడు. నాయనా! నన్ను మీరు దూషించటములో వున్న ఆనందమేమిటి? అని ప్రశ్నించాడు. వారు కారణాలు చెప్పకుండా మరింత హేళనగా ఆతనిని దూషించటానికి ప్రారంభించారు. సరి. మీకు యెంత సేపు యిష్టంగా వుంటుందో దూషించమని కూర్చున్నాడు. తిట్టి తిట్టి వారికి నోరు నొప్పి వచ్చింది. వారు యింక వెళ్ళిపోవుటకు సిద్ధముగా వుంటుంటారు. వెళ్ళిపోయేముందుగా వారికి బుద్దుడు చెబుతున్నాడు. "నాయనలారా ! రాబోయేగ్రామములోపల అందరూ నా పైన అమితంగా ప్రీతి కలిగినవారు. నేను ఆ గ్రామములో చేరిన తరువాత మీరు యీ విధముగా ప్రవర్తిస్తే మిమ్ములను ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు యెంతవరకు నన్ను దూషించాలని యిష్టముంటుందాదో అంతవరకు దూషించటానికి మీకు అవకాశమిచ్చేకోసం యింత సేపు నేను యిక్కడ కూర్చున్నాను. ఇతరులను సంతోషపెట్టాలి అంటే మనము ఎన్నో విధములుగా శ్రమలు పడాలి. ధనము వ్యయము చేయాలి. నేను యీనాడు నయా పైసా ఖర్చుకాకుండా, యేవిధమైన శ్రమపడకుండా మీకు యింతమందికి యింత ఆనందాన్ని అందిస్తున్నాను. ఈనాడు ఎంత హాయి నాకు అన్నాడు. నన్ను దూషించటం మీకు ఆనందంగా వున్నదంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం. ఏదో ఒక విధముగా మీకు తృప్తి కలిగించాను. ఈ తృప్తి కలిగించటంచేత నాకు చాలా ఆనందం, పరులను సంతృప్తి పెట్టేకోసమని అనేకమంది సత్రాలు కట్టిస్తారు. బావులు (త్రవ్విస్తారు. ఇంకా అనేక విధములైన వుపకార కర్మలాచరిస్తారు. ఏమీ శ్రమలేకుండా యీ విధముగా యీ దుర్మార్గులను సంతోష పెడుతున్నానంటే నేను యెంతో గొప్పపని చేసినవాడనే" అన్నాడు. మరి యింకొక విషయమును చక్కగా హృదయానికి హత్తుకునేటట్లు బోధించారు. "నాయనా! నీ యింటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. భవతి భిక్షాం దేహి అని అడిగాడు. నీవు బిచ్చము తీసుకొని వచ్చావు. కాని అతను ఆడిగిన బిచ్చము తేలేదు. మరొక బిచ్చము తెచ్చావు. అది అతను తిరస్కరిస్తాడు. అపుడు ఆ బిచ్చము యెవరికి చెందుతుంది?" అన్నాడు. నేనే వెనుకకు తీసుకుపోతాను. ఆ బిచ్చము నాకే చెందుతుంది అన్నాడు. అదే విధముగనే నీవు దూషణ అనే బిచ్చము తెచ్చి నాకివ్వటానికి ప్రయత్నించావు. దానిని నేను తీసుకొనలేదు. అప్పుడు యీ భిక్షము ఎవరికి చేరుతుంది!నీకే చేరుతుంది. కనుక నిన్ను నీవు దూషించుకుంటున్నావు. నన్ను కాదు. మనము ఒక రిజిష్టరు కవరు ఒక మిత్రునికి పోస్టులో వేస్తే ఆ ఫ్రెండు ల రిజిష్టరు కవరును తీసుకోకుండా పోతే పోస్టల్ డిపార్టుమెంటులో యేమవుతుంది ఆ కవరు? అది ఎవరు పంపించారో వారికే రీడైరక్టై చేరుతుంది. అదే విధముగనే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేదా ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యము చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరక్ట్ అయిపోతుంది. కనుక ద్వేషమనే దానిలో ఆసూయ అనేదానితో తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తూ వున్నాననుకోవటం కేవలం అల్పత్వం.
(శ్రీస.గీ. పు. 218/219)