అసహ్యించు కోవటం అనే ముల్లును నీమనసులో ఉంచుకోకు. అందరిని ప్రేమించడం నేర్చుకో. కోరిక తుఫామ వంటిది, ఆశ సుడిగుండం, గర్వం కొండవాలు, అనుబంధాలు జారిపోతున్న మంచు చరియలు, అహంకారము అగ్ని పర్వతం. నీవు భగవంతుని నామాన్ని జపించినప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు వాటి నన్నింటిని దూరంగా ఉంచు. అప్పుడు నీ సమసత్వం చెదరదు.(ప్రేమ నీ హృదయ సింహాసనాన్ని అదిష్టించని అప్పుడు సూర్య ప్రకాశం, చల్లని గాలి, తృప్తి అనే సెలయేటి గలగలలునీ నమ్మకమనే వేళ్ళను పోషిస్తాయి.
(ఆ.ప.పు.130)