తల్లి చాలా ప్రధానము. తల్లికి మొట్టమొదట gratitude చెప్పాలి. తల్లికి ఆనందము నందించాలి. దీని కోసం? నీ బ్లడ్, నీ దుడ్డు, నీ ఫుడ్ అంతా తల్లితండ్రులు గిఫ్టే. ఆ తల్లి తండ్రుల gift అందుకొని వారికి gratitude అందించక యింక ఎవరికి gratitude అందిస్తావు? Mother నిన్ను select చేసుకున్నది నీవు కాదు. నీకంటే ముందుగానే పుట్టింది. ఆమెకు నీవు గౌరవము నందించాలి. నీవు select చేసుకున్నది భార్యను మాత్రమే. ఆమె నీ తరువాత పుట్టినామె. నీ కంటె ముందు పుట్టింది తల్లి. నీ కంటే ముందు పుట్టిన తల్లికి gratitudeయివ్వాలి. ఆమె నుండియే నీవు ఆవిర్భవించావు. ఆమెనే దైవత్వంగా భావించాలి. కనుక select చేసుకున్న భార్యను, నిన్ను ముందు రక్షించిన తల్లిని equal గా చూసుకోకూడదు. అయితే personal విషయంలో నీ సంబంధము నీవు చూచుకోవచ్చు. కాని కుటుంబ విషయములో తల్లికి మొట్టమొదట గౌరవము. ఆ తల్లి శ్రమలకోర్చి నిన్ను యింత పెద్దవానినిగా చేసింది. కనుక వేదాంత మందు "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ" అన్నారు. అందరికంటే మొట్టమొదట తల్లిని పెట్టారు. ఆ తల్లి లేక నీవు లేవు. కనుక నీవు తల్లితో మృదుమధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. నీవు యిక్కడ నుంచి వెళ్ళిన తరువాత యిక్కడి సమాచారము మధురమైన మాటలతో వినయ విధేయతలతో తల్లికి చెబుతే ఆమె ఎంతో ఆనందిస్తుంది. మీరు మీ తల్లి తండ్రులతో మాత్రమే కాక మిత్రులతోను, బంధువులలోను సరైన మార్పు తెప్పించాలి. ఇదే నీవు చేయవలసిన సేవ. సేవ అంటే ఏమిటి? “మంచిని పది మందికి బోధించటమే సేవ" మంచిని పది మందికి చేయటమే సేవ. ఇది స్వామి యొక్క ఆశయము. నాకింకేమీ అక్కరలేదు.
(శ్రీ స.పు.47)