కృష్ణుడు, తన యెడ గాఢమైన భక్తియు, విశ్వాసమును కలిగి ప్రార్థించు ఆర్తులు మొరలాలించి, తప్పక పాలించునని పెక్కు తార్కాణాలతో భారతము నిరూపించుచున్నది. అట్టి తార్కాణాలలో, కౌరవ సభలో అవమానికమై, దుర్భర దుఃఖముతో మొర పెట్టినఘట్టమొకటి.
భగవంతుడెప్పుడును భక్తుని ప్రార్ధనమునకు వెనుకనుండు వేదననే ముఖ్యముగా చూచును. ఆవేదన యనుభైకవేద్యము. అదే భగవంతునకర్పింపదగినది. భగవదర్శితము చేయుట ద్వారా కర్మయే ఉపాసనమగును. రతి (అనురాగము) విత్తనము. భావము (చిత్తవృత్తి)మొలక: ప్రేమ వృక్షము; సచ్చిదానందము దాని ఫలము. వేదములలో కర్మకాండ, ఉపాసకాండ, జ్ఞానకాండ. అని మూడు భాగములున్నవి. ఆమూడింటిని మహాభారతము బోధించును. కాబట్టి భారతము వేదరక్ష ఫలముగా చెప్పనగును.
(స.వ.పు.9)
విషవాంఛలు - భావోద్వేగములు అనెడు కొండవాగులు జీవిత కాలములను కూలద్రోయకుండా తిన్నగా సాగిపోవుటను ధర్మము పొర్లుకట్టలు నిర్మించునది. ఆకట్టలెట్టివో మహాభారతము విస్పష్టముగా వివరించును. బ్రహ్మ చర్యము, గార్హస్థ్వము, వానప్రస్థము, సన్యాసము. అను నాల్గుగాశ్రమములను, ఆ వాగులు దాటుటకు కట్టిన వంతెనలు, అవి జీవిత యాత్ర లోని మజిలీలు. ఏయాశ్రమములో ఎట్లు వర్తించవలెనో తెలుపు నిబంధనలతో ఆనాలుగాశ్రమములును, వ్యక్తి క్షేమము కొరకును, సంఘ క్షేమము కొరకును, ప్రతివానికిని విధింపబడినవి. అవి మానవుని లోని పశుత్వోద్రేకము నణగించి, మానవత్వమును కాపాడును. మహాభారతము ఎల్ల ప్రజలకును ఉపాధేయమైన దివ్యోపదేశము.
(స.వ.పు. 10)
(చూ॥ త్యాగం, ప్రధానమైన అస్త్రము, పంచమవేదము, బలహీనుడు)