మతబాంధవ్యము

అన్ని మతాల్లోనూ సూక్తులు సూత్రాలు దాదాపు ఒకేరకంగా వుంటాయి. మతాల పరస్పర సంబంధాన్ని యిది సూచిస్తుంది.

మొదట వేదమతం ఉద్భవించింది. 2500 ఏళ్ళ కిందట వచ్చిన భౌద్థం వేదమతానికి కొడుకు వంటిది. పాశ్చదేశాల ప్రభావంగా కనిపించే క్రైస్తవ మతం మనమడు కాగా క్రైస్తవ ప్రవక్తల బోధల ఆధారంగా వచ్చిన ఇస్లాం మునిమనవడు అనుకోవచ్చు. అన్నింటిలోను ప్రధానంగా కనిపించేది ప్రేమ. మనిషిని మనిషిగా చేసి దివ్యత్వంవైపు నడిపించేది ప్రేమే!

(శ్రీసా.గీపు.260)

 

మతము మతముకు మధ్య ద్వేషము-

జాతి జాతికి మధ్య జగడము

దేశదేశములందు రగడలు-దేనికయ్యా?

మత ప్రబోధలు కన్ను విప్పి చూడరోరన్నా-

శ్రీసా యి దేవుని ఎన్నగా ఎందైన గలడన్నా:

మొన్న షిరిడీ నేడు పర్తీ ఉన్నవాడని పేరెగాని

తన్ను భావనచేయు భక్తుల కన్నులందే మెలగునన్నా !

(శ్రీ .వి.వా.పు. 191)

 

మతములన్నీ పరస్పర సుహృద్భాంధవ్యములు కలిగి ఉన్నాయి. అగుటచే వాటినన్నింటిన్నీ కూడా ఆహ్వానించు మతాలన్నీ మానవుల్ని భగవన్మార్గంలో నడుచునట్లు అభ్యసింపచేసే ప్రయత్నాలు మాత్రమే. మతాలన్ని మంచిపనులను చేయడం ద్వారా మనస్సును పవిత్రీ భూతం చేసుకొని తద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందాలని ఆశిస్తాయి. సర్వమతముల ఆంతర్యమూ వేదాంత తత్వము యొక్క సనాతన ధర్మమే. ఆసనాతనధర్మము సాధకుడు తన ఆధ్యాత్మికస్థాయిని అర్హతలనూ పురస్కరించుకొని భగవత్తత్వాన్ని సాక్షాత్కరింప చేసుకొనుటకు వీలుగా సాధ్యమైనన్ని మార్గాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది. వైదిక ధర్మాన్ని ప్రపితామహునిగానూ, బౌద్ధమతాన్ని పుత్రునిగానూ, క్రైస్తవాన్ని పౌత్రునిగానూ, ఇస్లామును పపౌత్రునిగానూ అభివర్ణించవచ్చు. వీటి మధ్య అభిప్రాయ బేధమేమైనా వస్తే అది కుటుంబ సమస్య మాత్రమే. మనమందరమూ భాగస్వాముల మైన ఆపిత్రార్జితపుటాస్తి అంతా ఒకటే.

(సా. .పు 267/268)

(చూ|| ప్రార్థనగీతము, సర్వమత సామరస్యం, స్వామి బాల్యము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage