"దేవా! ఓదేవా! పట్టు వదిలి పెట్టకు
వదిలి పెట్టకు నీ పట్టు ఎంత చెడ్డవాడినినేనైనా
ఓదేవా! వ్యర్థం కానిస్తావా నాకాలాన్ని
వ్యర్థం కానియకు స్వామి! నేనెంత సోమరినైనా!
ఓ దేవా, పెడదారిపట్టనీకు నన్ను స్వామీ
పెడదారిని పోనివ్వకు నన్ను ఎంత చంచల స్వభావిని నేనైనా !
ఓ దేవా! కన్ను మరుగు కానివ్వకు నేనెంత తుంటరినై పారిపోదలచినా!
ఎంత భాద్యతారహితుడనై ప్రవర్తించినా నన్ను నీ దృష్టి దాటి పోనివ్వకు స్వామీ!
నీ వాడినైన నన్ను కాపాడటానికి పరుగెత్తుకు వస్తావు నీవు
నా తప్పొప్పులు తులాభారం వేస్తూ ఆలస్యం చెయ్యవు!
నీ వారమైన మేము దుఃఖిస్తుంటే చూసి పట్టనట్లుగా ఊరకుండలేవు నీవు.
పేదల ప్రార్థనలకు ప్రతిస్పందించకుండా ఉండలేవు నీవు "
(శ్రీస.. ప్రే స. పు. 77)
"అనుగ్రహపుజల్లును నా పై వర్షించటానికి నీ కంటె దయామయుడు మరెవ్వరూ లేరని గట్టిగా నమ్ముతున్నాను ప్రభూ! ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చంది! తెలియచెప్పు ప్రభూ!
నా ప్రార్థనకు , అభ్యర్థనకు వెంటనే బదులు యిస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభూ! ఈ కారణం వలననే కాదా నీపాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభూ!"
నా ప్రక్కనే నువ్వుంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభూ, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది! నిన్ను నేను ఏది కావాలని కోరినా నవ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభూ! ఇందుకే కదా నీ కటాక్షవీక్షణం కోసమై నీ చెంత వేచి యున్నది.! ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు! నీ వరాల వర్షం కురిపించటంలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని ఎన్నేళ్ళయినా కానీ ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకానీ కోసం నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను నేను నీ చెంతనే."
(శ్రీ.. స ప్రే..స.పు.77/78)
నేడే రేపో కరుణించి నాకు మార్గదర్శివపుతావని
ఆశిస్తూ వేచి ఉంటాను ప్రతిరో జూ!
దర్శన మిస్తావేమేననే ఆశతో, ఇవ్వవేమోననే
బెదురుతో అప్రమత్తుడనై ఉంటాను ప్రతి గంటా!
ఈ క్షణమే నీవు నావైపే తిన్నగా వస్తావనే
ఆశతో ఎదురుచూస్తుంటాను ప్రతి క్షణమూ!
(శ్రీ.స.. ప్రే.స..పు.78)
“కాపాడు ఓ సాయి దేవా! నీకంటె దయ గల దేవుడు లేడింక!
తప్పుత్రోవలో మునిగి పోయాను. దుష్టత్వంత్రో కొట్టుకుపోతున్నాను.
ఏ సహాయము కనబడటం లేదు నాకు, ఓ సాయి! నీ అనుగ్రహం కావాలి నాకింక
పాలలోనే ముంచుతావో, మరి నీటిలో ముంచుతావో ఏమైనా సరే నిన్ను నిందించను. దూషించను.
వచ్చావు నీవు మనిషి రూపంలో ఈ కలియుగంలో
తమకు తామే వేసుకున్న బంధాల సంకెళ్ళనుండి
మానవులకు విముక్తి కలిగించడానికై
బలహీనులు భగవంతుని ఘనకీర్తిని వర్ణించగలరా?
అటువంటి వారిని బలహీన మనస్కులుగా క్షమించి వదలివేస్తావు నీవు
ఎప్పుడైతే నేను దృఢమైన విశ్వాసంతో పుడమిపై
అవతరించిన భగవంతుని నిజావతారంగా నిన్ను పూజిస్తానో
అప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నావెంటే వుంటావు.
నన్ను ఓదార్చటానికి, రక్షించటానికి ".
(శ్రీ.స.ప్రే.. స.పు.86)
"ఆహరహ తవ ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదరవాణి హిందూ బౌద్ధ శిఖ్ఖ జైన పారశిక ముసల్మాన కిరస్తానీ "
(దై.ది.పు.201)
(చూ॥ స్వామి బాల్యము)