మనము భుజించే దానిలో నాలుగురకములైన ఆహారములు ఉంటున్నాయి. ఒకటి పళ్ళలో నమిలేటటువంటి పదార్థము, రెండవది నాలుకతో రుచిచూచి చప్పరించే టటువంటి పదార్థము. మూడవది జుర్రుకోవటం, నాలుగవది కేవలంమ్రింగటము. మనలో చేరే పదార్థములంతా ఈ నాలుగు రకములుగా ఉంటున్నాయి. కనుక వాటిని పరమార్మునికి అర్పణం గావించుకునే నిమిత్తం...
శ్లో బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహూతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా|| గీ.4-24 ||
శ్లో! అహంవైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విరమ్||. . గీ. 15-144 ...
అనే శ్లోకములను భుజించే సమయము నందు పఠించాలి. ఎందుకంటే? మొదట మనము భుజించే ఆహారమును బ్రహ్మార్పితము గావిస్తే అందుకు భగవంతుడు నేనే వైశ్వానర రూపంలో నీ కడుపులో ఉండి, నీవు తినేటటువంటి నాలుగు రకములైన ఆహారములను నేనే ఆరగించి, పుష్టిని, శక్తిని, నీ సర్వాంగములకు అందిస్తున్నాను." అంటున్నాడు. కనుక మనము భుజించే ఆహారములో ఎటువంటి దోషములున్నప్పటికీ, అది భగవదర్పితము చేయుట వలన ప్రసాదముగా మారి పవిత్ర మవుతున్నది.
(శ్రీ భ.ఉ.పు21)
ఎంత మంచితిపూ మీరంతా సేవింపుడీ
పోవును దుర్భావము రాబోవును సద్భావముల్
ద్రావంగ దైవంగ పాపమెల్ల బాపగన్ "ఎంత? (అనిపాడి అందరిని ఆనందంలో ముంచెత్తేవారు)
నూరిపోసేమందుకాదు నూరువరహాలిస్తే రాదు
దారిచూపి సాయినాధుని దయచే తరియించే మందు ||నూరి||
కనలేరు కొనలేరు నిజమైన యీమందు
కనుగొనుచు తిన్నవారు గడియలో కడతేరే మందు.||నూరి||
అని తీయ్యని కంఠంలో కమ్మగా పాడుతూ
కమ్మటి ప్రసాదములను అందరికీ పంచువారు. ||నూరి||
సాయి నామమును ప్రసాదమిదిగో. రండి భక్తులారా ||నూరి||
వేదసారమనుగోధుమపిండిలో వేదవాక్యమను
క్షీరముపోసి ఆధారమైన పెద్ద పాత్రను తీసి,
అది సాయి దీని పాకము బెట్టెను ||నూరి||
రకరకమైనది సాయి ప్రసాదం, సకల రోగనివారణమోయీ
ఒక కాసైనను ఖర్చులేదోయి. తఖరారు సేయక తారకమైనది. ||సాయి||
సారమైనదీ సారధిపాత్ర, సారధి దాసులకేమో
యెరుక దూరముపోయి కొనపనిలేదు.
పర్తీపురమున కొల్లగ దొరుకును ||సాయి||
(ఆ.శ.పు. 12/13)
మానవుడు భుజించే ఆహారమువల్ల రాగద్వేషములు అభివృద్ధి ఔతున్నాయనే సత్యాన్ని గుర్తించి మనప్రాచీనులు భుజించుటకు పూర్వము ఆహారమును పరిశుద్ధి గావించుకునే వారు. "అన్నం బ్రహ్మ రసో విష్ణు: భక్తాదేహోమహేశ్వరః" అని ప్రోక్షించుకునేవారు. ఈ భుజించే అన్నము బ్రహ్మతో సమానము. రసము అనగా త్రాగే నీరు భుజించే పదార్థముల సారము విష్ణురూపము తినేవాడు మహేశ్వరుడు. భుజించే అన్నము శాశ్వతమైనఆనందాన్ని అందించాలి. అని ఋతం సత్యం ప్రోక్షింపబడుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన మీరు ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి అని ఆహారమును ఋతముగా సత్యంగా మార్చుకొనే నిమిత్తమై ప్రోక్షించి పవిత్రము గావించి ప్రసాదముగా స్వీకరించేవారు.
(బృత్ర.పు. 105)
(చూ॥ ప్రార్థన)