సకల శాస్త్రముల యొక్క ముఖ్యసూత్రములు ఉపనిషత్తులలో ఇమిడియున్నవి. అందువలననే అన్నింటికిని ఉపనిషత్తులు ప్రమాణములైనవి. ఆ పవిత్ర ఉపనిషత్తులు మానవులచేత వ్రాయబడినవి కావు. అనగా అపౌరుషేయములు.
ఆదికాలము నుండి వచ్చు వేదముల ఉపాంగములే, అనగా వేదస్వరూపమునందలి కొన్ని అంగములే ఉపనిషత్తులు, ఇట్టి అనేక అంగములతో విరాజిల్లునదే వేదము. కాన ఉపనిషత్తులకు ఆధారమూ ప్రమాణమూ వేదము.
( )
(చూ|| కంప్యూటర్లు, షడ్ దర్శనములు)