మహాభారతములో పంచపాండవులున్నారు. ఇందులో పెద్దవాడు ధర్మజుడు. ధర్మజుని తరువాత భీముడు.భీముని తరువాత అర్జునుడు. అర్జునుని తరువాత నకుల సహదేవులు. ఈ ఐదుమందిలో మిగిలిన నలుగురు ధర్మజుని అనుసరించేవారు. ఈనాడు ప్రపంచ పోలికలను తీసుకుంటే బాంబులు అవి అభివృద్ధి చేసినవారు అమెరికా వారు రష్యావారు. ఆమెరిక న్సు అర్జునుని వంటి వారు.అనేక అస్త్ర శస్త్రములను ధరించి ఒక్క తూరి భస్మము గావించే శక్తి అర్జునునిలో ఉంది. భీముడు మంచి బలవంతుడు. భుజ బలము, బుద్ధి బలము, గద బలము, వీటిని రష్యన్సుగా మనం భావించుకుందాం. భారతదేశము ఏమీ చేయలేదే అనుకుంటారు కదా. భారతదేశము ధర్మజుని వంటివాడు. ఈనాడు మనము చేయవలసినది ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి. ధర్మాన్ని మనము అభివృద్ధి చేస్తే భుజబలము బుద్ధి బలము ఉండినవారు దర్మజునికి శరణాగతులైపోతారు. మనము ఎవరిని ఏ విధంగా హింసించకూడదు. ఎవరిని మనం బాధించకూడదు. ఆ విధమైన ధర్మము మనము అనుసరిస్తే మనకు ఏ బాంబులు అక్కరలేదు. ఏఅస్త్రములు అక్కర లేదు. ధర్మమే భారతీయుల ప్రధానమైన అస్త్రము. సత్యమేభారతీయుల కీరీటము. ఏ దేశము వారికైనా సత్యము, ధర్మము చాలా ప్రమాణము. అన్ని దేశముల వారికి సత్యము ఒక్కటే. సత్యమే truth అమెరికన్ truth రష్యన్ truth పాకిస్తాన్ truth ఇండియా truth అని భేదముందా? లేదు. Truth is one. ఏ భేదము లేదు. కాని అన్ని దేశముల వారు సత్యమును ధర్మమును అనుసరించాలి. ఈ రెండింటిని అనుసరిస్తే ఏ విధమైన కలతలు కల్లోలములు ఉండవు. అన్ని దేశములు శాంతిగా ఉంటుండాలి.
(శ్రీస.పు. 41/42)