సత్యనిష్ఠకు - ధర్మదీక్షకు పేరు పొందిన దేశం మనది! శాంతి అహింసలు కవచకుండలాలుగా వర్ధిల్లిన దేశం మనది! ఆధ్యాత్మిక సంపదను - ఆత్మవిజ్ఞానాన్ని అఖిల ప్రపంచానికి అందించిన దేశం మనది! సత్యపధాన్ని చూపించి - ధర్మజ్యోతిని వెలిగించిన దేశం మనది! ఈ భూతలాన్ని శాంతి ధామంగా - ప్రేమసీమగా - పవిత్ర క్షేత్రంగా మార్చాలని చూసిన దేశం మనది! సత్య నిరతికి - ధర్మదీక్షకు పేరుపడిన దేశం మనది! ఆర్షధర్మాన్ని - సనాతన సంసస్కృతిని వేద విజ్ఞానాన్ని సర్వ ప్రపంచానికి పంచి పెట్టిన దేశం మనది! భారతీయుడై జన్మించినందుకు భారతమాత ధర్మాన్ని కాపాడువలసిన కర్తవ్యం మన అందరిపైనా ఉంది! ఈ దేశ పవిత్ర వారసత్వ సంపదను కాపాడుగలమని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ తీసుకోవాలి.
ఐకమత్యంబు - జ్ఞానంబు అందజేసి
జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియె
ఈ దివ్య జ్యోతిని అందించు దేశమిదియె
భారతదేశాన పుట్టుటే భాగ్యమౌరా!
(దే.యు.పు.48)
(చూ|| కృష్ణుడు. దేవుడెక్కడున్నాడు?)