పరలోకమనగా మనకు కనిపించని లోకం. స్థితికాని స్థితి పరం, పరం అనగా రాక పోకలు లేనిస్థితి. అంతే కాదు ఏమీలేని స్థితి పరం అని చెప్పారు. అనగా ఎలాంటి స్థితి లేనిదానిని పరం అన్నారు. ఇట్టి పరతత్త్వములో కూడినట్టిదే పూర్ణత్వము (పరలోకము) పూర్ణత్వమునకు ఆది అంత్యములు లేవు. అటువంటిదే పరలోకము. ఆది మధ్యాంతములు ఉండవు. పరబ్రహ్మ, పరంజ్యోతి, పరమేశ్వరుడు, పరంధాముడు, పరవిద్య (బ్రహ్మవిద్య) పరాభక్తి, పరమసత్యము, పరమపదార్థము, ప్రేమ మొదలగునవి. ఇది పరమార్ధస్థితిని తెలుపుతాయి.
(సా.పు528)