ప్రాచీన కాలము నుండి భారత దేశము అన్ని దేశములకూ దైవత్వాన్ని గురించి ప్రచార ప్రబోధలు సల్పులూ, సుస్థిరమైన శాంతి, భద్రతలు చేకూర్చుతూ వచ్చింది. ప్రాచీన భారతీయ సంస్కృతి చాల పవిత్రమైనది: ఇది దివ్యమైనది. భవ్యమైనది. నవ్యమైనది. కాని, ఇట్టి సంస్కృతి యొక్క తత్యాన్ని ఎవ్వరూ విచారణ చేయటం లేదు. ఈనాటి విద్యార్థులు కూడా ఈ సంస్కృతి యొక్క తత్త్వాన్ని ఎవ్వరూ విచారణ చేయటం లేదు. ఈ నాటి విద్యార్థులు కూడా ఈ సంస్కృతిని అర్థం చేసుకోలేక పోతున్నారు. మహాభారత యుద్ధం యొక్క ఫలితాన్ని ఉదాహరణగా తీసుకోండి. పంచ పాండవులు నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ వచ్చారు. వారు భగవంతునికిమొట్టమొదట స్థానం అందించారు. ప్రపంచానికి రెండవ స్థానమిచ్చారు. స్వార్థాన్ని చివరికి నెట్టారు. First God, Next world, Last I అని వారు భావించారు. కానీ, కౌరవులు అలా కాదు. వారి దృష్టిలో మొదట స్వార్థం, తరువాత ప్రపంచం, చివరికి భగవంతుడు. అనగా, వారు First I, Next world, Last God అని భావించారు. కనుకనే వారు భగవంతుణ్ణి కోల్పోయారు. జీవితాన్నే నాశనం చేసుకున్నారు. కనుక, మానవుడు ఎల్లప్పుడు దైవాన్ని ముందు ఉంచుకోవాలి. దైవాన్ని ముందు ఉంచుకున్న వారికి ఏ ప్రమాదమూ సంభవించదు. దైవాన్ని స్మరించుకుంటూ దేశ సేవలో జీవితాన్ని గడపాలి. -
(ప.3.2.2000పు.5)