ఈ దేహము ద్వారానే అనేక పుణ్యములు సంపాదించి జ్ఞానమును పొంది మోక్షమును పొందుదురు కదా! అట్టి భగవద్విభూతులు నెలకొన్నచోటు కనుక ఇది క్షేత్రమని పిలువబడును. క్షేత్రమన్న కవచమువలే జీవుణ్ణి కాపాడేదనిమరొక అర్థము; భూమి అని మరొక అర్థము, పొలమనుటకు ఒక ఆధారము వున్నది. పొలమున యే విత్తనములు చల్లుదుమో నాటుదుమో అదే పంటను మానవులు తీసుకొందురు. కోనుకొందురు. శరీరం క్షేత్రం, క్షేత్ర పాలకుడు జీవుడు, పుణ్యబీజములను చల్లి సుఖసంతోషములను పంటను పండించుకొనును. పాపబీజములను చల్లి దుఃఖమును అశాంతి అను పంటను పొందుచున్నారు. జ్ఞాన విత్తనములు నాటి మోక్షమను ఫలమును పొందుచున్నారు. పొలమును రైతు తెలిసికొనునట్లు క్షేత్రమను దేహతత్వమును క్షేత్రజ్ఞుడను జీవుడు తెలుసుకొనును. క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఒక్కటి మాత్రమే వ్యత్యాసము అది = ‘జ్ఞ’శబ్దము. జ్ఞ అనగా జ్ఞానము అని అర్థము. అనగా జ్ఞానము కలవాడే క్షేత్రజ్ఞుడనియు, జ్ఞానము లేనిదే క్షేత్రమనియూ చెప్పవచ్చును".
(గీ.పు.200/201)
కాశీ, ప్రయాగ, గయ మొదలగు క్షేత్రములకు వెళ్ళినప్పుడు తమకు ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులను వదలి పెట్టాలంటారు పెద్దలు. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది అమితమైన ప్రీతిగా ఉంటుందో, దానిని భగవంతునికి అర్పితం చేయి అట్టి అర్పణే నిజమైన అర్పణగాని, నీకు ఇష్టములేనిది ఇస్తే అర్పణకాదు. కూరగాయల యందుగాని, ఫలములయందుగాని, నీకు అమిత ఇష్టమైన వాటిని భగవంతునికి అర్పితం చేయాలి. అర్పితం చేసిన తరువార, జీవితంలో తిరిగి ఆ ఫలమునుగాని, ఆ కూరగాయనుగాని భుజించ కూడదు మన భారతీయులు ప్రాచీన కాలమునుండి పవిత్రమైన క్షేత్రములలో ఇలాంటివి అర్పితం చేస్తూ వస్తున్నారు. మన దేహమే కాశి. ఈ కాశి మధ్యలో గంగ ప్రవహిస్తున్నది. ఆ గంగయే మన యొక్క జ్ఞానము. ఈ జ్ఞానమనే గంగయందు భక్తి శ్రద్ధ అనే యమునా సరస్వతులులోనై పోతున్నాయి. భక్తి, శ్రద్ధ, జ్ఞానము - ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ మన హృదయ స్థానమే. కాబట్టి హృదయానికి పవిత్రమైనటువంటి, ప్రీతికరమైనటువంటి ఫలమును అర్పితం చేయాలి. కాని దురదృష్టవశాత్తు ఈనాడు, సాంప్రదాయములన్నియు కూడనూ, ఆధునికమైన ఫ్యాషన్ క్రింద మారిపోయినాయి. ప్రయాగ పోతున్నాం. నీ కిష్టమైన పదార్థమును పరమాత్మకు అర్పితం చేయమని అక్కడ పండాలు చెబుతారు. ఇష్టమున్న దానిని గురించి యోచన చేయనవసరం లేదు ఇష్టం లేనిది ఏదాయని యోచించి, ఇష్టము లేని కూరగాయను, ఇష్టంలేని ఫలమును అక్కడ అర్పితంచేసి వస్తున్నారు. ఇది కాదు. ఏది బాగా ఇష్టమైనదేదో, దానినే అక్కడ అర్పితం చేయాలి. నా భగవంతునకు, నా ప్రేమ స్వరూపునకు నాకు అత్యంత ప్రీతికరమైన పదార్థమును అర్పితం చేయాలనే దీక్ష మనలో ఆవిర్భవించాలి కాని ఆ విధంగా చేయటం లేదు. నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు. కనుకనే హృదయమునందున్న హృదయేశుడు తథాస్తు "తథాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు. నీవు చేసినట్లుగానే జరుగుగాక! అనగా ఏమిటి? భగవంతునకు ద్రోహం చేస్తున్నావు. నీకు ఇష్టం ఉన్నది ఒకటి. ఆర్పితం చేసుకున్నది మరొకటి కనుక భగవంతునికి కూడాను తనకు ఇష్టము లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి ఇష్టము లేనిదే వానికి కూడా అనుగ్రహిస్తుంటాడు. నాకు ఆరోగ్యం కావాలి స్వామీ! అంటే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు. నాకు ధనం కావాలి స్వామి" ప్రార్థించే వానికి దారి ద్రాయన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే, నీప్రార్థనలకు తగినటువంటి ఫలితమే. "యద్భావం తద్భవతి" నిజంగా నీ హృదయ పూర్వకంగా మంచిని అందిస్తే, భగవంతుడు మంచిని ఎందుకు అందించడు? నీవు చెడ్డను అందిస్తున్నావు గనుకనే, నీవు చెడ్డను పొందుతున్నావు కనుక నీకు పరిపూర్ణమైనటువంటి,ప్రేమతో వుండినటువంటిదానినేభగవంతునికిఅర్పితం చేయాలి.
(శ్రీ.ఆ. 95, పు. 7,8)
శరీరేంద్రియమనోబుద్ధులునాల్గింటిఎకత్వస్వరూపమేక్షేత్రముఅన్నారు. ఈక్షేత్రముకేవలము జడమైనది. మనస్సు జడమైనదే. ఇంద్రియములు జడమైనవే. దేహము జడమైనదే.ఈ జడమైన వాటి స్వభావమును కంట్రోల్ చేసేది క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రక్షేత్రజ్ఞులకుమధ్య కొంత అవకాశముంటుండాది. అదే సృష్టి యొక్క పరిణామము. ఈ క్షేత్రము మరికొన్ని మాలిన్య మైనవానిలోను శుద్ధమైనవానిలోను స్నేహము కల్గి వుంటుంది. అవియే సత్వరజస్తమము అనే త్రిగుణములు. ఈ - సత్వరజస్తమోగుణములు చాలా విచిత్రమైనవి. చాలా ఆశ్చర్యమైనవి.(బృృత్ర.పు. 100)
(చూ|| ప్రకృతి, మూలాధారం)