"క్షమ సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః"
సత్యవంతుల సత్యమే క్షము. యజ్ఞమే క్షమ, క్షమయే యజ్ఞము. తేజోవంతుల తేజమే క్షమ. తపస్వుల బ్రహ్మమే క్షమ.
క్షమ వేదము క్షమ మహింస క్షమ ధర్మంబౌ
క్షమ సంతోషము క్షమ దయ
క్షమయే ఆధారమగును సర్వంబునకున్
ప్రతి మానవుడు తన జీవితమును ప్రధానముగా సాధించవలసిన సద్గుణము ఓర్పు.
( శ్రీ స గీపు. 206)
క్షమతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. క్షమకు మించినది జగత్తులో మరొకటి లేదు. క్షమ సత్యం. క్షమ ధర్మం, క్షమ వేదం, క్షమ అహింస, క్షమ సర్వం, క్షమ సంతోషం, క్షమ దయ, క్షమ సర్వస్వం సర్వలోకములందు అన్నారు. క్షము అనగా ఓపిక, ఓర్మి. ఓర్మిమిని సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారమౌతాము. ప్రతి చిన్న విషయమునకు ఒక tension, temper, ఒక విధమైన ఆవేదన, ఆవేశమును అభివృద్ధి పరచుకొంటున్నాము. ఈ ఆవేశము చాలా ప్రమాదము. ఇది మానవుని జీవితమునే క్షీణింప జేస్తుంది.
కోపము కలిగినవానికి
ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్
పాపపు పనులను చేయుచు
ఛీ పొమ్మనపించుకొనుట చేకురుచుండున్.
ఇంతే కాక కోపము వలన
తన కలిమి భంగ పుచ్చును
తనకున్ గల గౌరవంబు దగ్ధము చేయున్
తనవారల కెడ సేయును
జనులకు కోపంబువలన సర్వమును చెడున్.
(గీ. పు. 39/40)
క్షమ, దీనినే క్షా o తి అనికూడనూ అందరు. సహనమని కడనూ అందరు. అనగా పరులు తనకెట్టి అపకారములు, కీడులు, ద్రోహములు చేసియుండిననూ, తనను ద్వేషించుచుండిననూ, వాటనన్నిటినీ, స్వప్నదృశ్యములుగా తలంచి, యెండమావులుగా భావించి మరచిపోవుట. అయితే ఆ వోర్పు చేతకాక, శక్తిలేక, విధిలేక వోర్చుకోవటము కాదు, హృదయపూర్వకమైన శాంతితోపాటు బైట శాంతి కలసి రావలెను. లోకుల యొక్క మెప్పులకై తనకు ధన, జన బలములు లేకనో, చాలకనో, లేక తానేమి చేసినా చెల్లదనో వోర్పుతో వుండుట క్షాoతి కాజాలదు. క్షమయును ఆహింసవలె ప్రధానమైనది.
(గీ.పు. 208)
మానవునికి క్షమాగుణం చాల ప్రధానమైనది. క్షమ సత్యము. క్షమ ధర్మము. క్షమ వేదము. క్షమ అహింస. సర్వలోకములందు క్షమను మించినది లేదు. ఎవరైనా మీకు అపకారము చేసియుంటే వారిని క్షమించండి. అది నా మంచికోసమే అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే "దేహాన్ని తిట్టాడా, లేక ఆత్మను తిట్టాడా?" అని విచారణ చేయండి. ఒక వేళ వాడు మీ దేహాన్ని తిడితే, ఒక విధంగా మీకు ఉపకారం చేసినట్లే. ఎందుకంటే, దేహం అనిత్యమైనది. మలమూత్రదుర్గంధమాంస రక్తములలో కూడినది అని మీరే తిట్టుకుంటున్నారు. ఒకవేళ ఆత్మను తిడితే - వాని యందు, మీ యందు ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి, తనను తాను తిట్టుకున్నాడనుకోండి. ఎంత గొప్ప క్షమ ఇది! ఇట్టి హృదయవిశాలతను మీరు కల్గియుండాలి.
(స.సా.ఆ. 2000 పు. 231)
(చూ॥ ఇరువది గుణములు, తల్లులు)