బ్రాహ్మణులు నిధి వలెకాపాడిన సంస్కృత భాషను ఈ కస్తూరి బ్రాహ్మణుడై ఉండి కూడా నేర్చుకోలేక ఎ, బి, సి, డిలలో ప్రవేశించి ఎంతో విలువైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు." పాపం! ఆంగ్ల భాషా వ్యామోహంలో పడి కస్తూరి ప్రాచీనభాష అయిన సంస్కృతంలో అధికారం లేకుండా చేసుకున్నాడు" (పుట్టపర్తిలో నేను సంస్కృతం పట్టుదలగా నేర్చుకొని రోజు జరిగే పూజా కార్యక్రమాలలో నమకం, చమకం చదవటంలో పాలు పంచుకోగలిగాను). "తరువాత యూనివర్శిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందువుగాని. నువ్వు నా జీవిత చరిత్ర వ్రాయాలి! నువ్వే! వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని గురువులను, యింకా ఎవరెవరిని కలుసుకోవాలో నేను చెపుతాను. నేను కూడా సహాయం చేస్తాను", "బాబా గబగబ నా దగ్గరకు వచ్చి నా భుజంపై చేయి వేస్తూ ఇంక నీకు పుట్టపర్తిలో యిపుడు కావలసినంత పని ఉంది. ఒక మాస పత్రిక త్వరలో ప్రారంభించబడబోతుంది. సంకల్పించిన పేరు సనాతన సారథి" అన్నారు.
(శ్రీ. స. ప్రే. ప్ర. పు. 15, 17, 68, 69, 218)
ఒక పర్యాయం నేను ఉన్నట్లుండి దేహాన్ని వదలి పెట్టాను. ఆ సమయంలో కస్తూరి, లోకనాథం, సూరయ్యలు అక్కడే ఉన్నారు. వాళ్ళు ముగ్గురూ చాలా గొప్ప భక్తులు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండేవారు. నేను పరుండేంత వరకు అక్కడే కూర్చునేవారు. "ఏమిటిది, బాబా దేహాన్ని వదలిపెట్టి వెళ్ళారే! అవి కన్నీరు కార్చుకున్నారు. లోకనాథం స్వామి పాదాలపై పడి ఒకటే ఏడుపు. అయితే, కస్తూరికి కొంచెం తెలుసు. "ఏడ్వకండి. దీనికి మనం ఆనందించాలి. ఎక్కడ ఏ భక్తులు ఏడ్చినారో ఏమో! వారి బాధను నివారించడానికి స్వామి వెళ్ళారు" అంటూ వారికిధైర్యం చెప్పాడు. రెండు గంటల తరువాత నేను తిరిగి దేహంలో ప్రవేశించాను. అప్పుడు కస్తూరి "స్వామీ! మీరు భక్తరక్షణ చేయవద్దని నేను చెప్పను. పరమ భక్తులను రక్షించడానికి మీరు వెళ్ళేటప్పుడు వద్దని చెప్పటానికి మాకు అధికారం లేదు. కాని దేహాన్ని మాత్రం వదలి పెట్టి వెళ్ళకండి. మీరిక్కడే ఉంటూ అక్కడ భక్తులను రక్షించవచ్చు కదా!" అని ప్రాధేయపడ్డాడు. ఇలాంటి చిత్రవిచిత్రమైనవి ఎన్నో జరుగుతుంటాయి.
(స.పావా. 2002 పు. 185)
(చూ విరాట్ పురుషుని విశ్వరూపము, సత్యం శివం సుందరం)