ఆత్మ స్వరూపుడైనా పరమాత్మకు సహితము అరుగుణములు కలవు. ఆవియే పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. ఈ గుణస్వరూపుడు సత్ (సంపూర్ణస్థితి) చిత్ (పరిపూర్ణ జ్ఞానము), ఆనందము (పరిపూర్ణానందము). ఇవి కేవలము భూత ప్రేత పిశాచులకు సంబందించినవి కాదు. పవిత్రులైన మానవులకు సంబంధించినవి కాన ఇట్టి సత్, చిత్, ఆనందస్వరూపుని చూడగోరుట సర్వ మానవకోటికి సమాన హక్కు. ఆదియే వాని విధ్యుక్త ధర్మము.
(ధ్యా, వా, పు.30)