కొందరు బోర్ల పండుకుంటారు. దిండుపైన బుక్స్ పెట్టుకుంటారు. వేళ్ళను అంబులవలె వంచుతారు. ఇలాంటివారు ఎన్ని గంటలు చదవినప్పటికిని వారి కేమి తలకెక్కదు. ఇక్కడ ఎత్తితే అక్కడ ఎత్తితే అమ్ముల పొదిగినట్టుగా ఉంటుంటాది. ఇలాంటి వికారమైన చేష్టల వలననే విద్యార్థులు జ్ఞాపకశక్తి లేకుండా పోతుండాది. సరియైన జ్ఞాపకశక్తి కుదరాలంటే చక్కగా కూర్చోని చదవాలి. అలసటగా ఉంటే బుక్స్ కట్టి నిదురపో. తప్పులేదు. ఈ నిర్బంధ మాఘస్నాన మెందుకు? చదవాలి, చదవాలి అని టీ త్రాగుతూ, నిద్దరపోతూ చదువుతుంటే యేమాత్రము ప్రయోజనము లేదు. జ్ఞాపకశక్తి పోవటమే కాకుండ ముందు ముందు భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి. చేతులు కాళ్ళు అదురుతాయి. రోమోటిక్ పెన్స్ మొదలవుతాయి. ఏ ఘన కార్యమును సాధించవలె నన్ననూ దేహముతోనే సాధించాలి. దైవానుగ్రహము పొందాలనుకున్ననూ దేహము ఒక పనిముట్టు ధర్మార్థ కామమోక్షములు సాధించవలెనన్ననూ ఈ దేహము ఒక ఆధారము.
(బృత్ర.పు౬౩)
మన చర్మచక్షువులకు ఏ రంగు అద్దాలు ధరింతుమో ప్రకృతి అంతయు ఆదే రంగుతోనే కనిపిస్తుంది. కనిపించేవన్ని మార్పు చెందునవే. మార్పు చెందే ఈ దృశ్యములకు మార్పు చెందని బ్రహ్మత్వము ఆధారమై ఉంటున్నాది. మనము కారులో లేక బస్సులో ప్రయాణమై పోతున్నాము. బస్సు కారు కదులుతుండాది. రోడ్డు కదలటం లేదు కదా! కదలనిరోడ్డుని ఆధారం చేసుకొని కదిలే బస్సు కారు ప్రయాణం సలుపుతున్నాము. కదలే ఈ జగత్తుకు, మార్పు చెందే ఈ జగత్తుకు, కదలని మార్పు చెందని దివ్యత్వము ఆధారమై ఉంటున్నది. అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతయు మనకు సులభంగా అర్థమౌతుంది. ఈ జగద్భావం అర్థం కాకుండా పోవటానికి కారణము మన మనస్సే. ప్రవృత్తి మనస్సు యొక్క లక్షణము.
(బృత్రపు ౧౫౯)
హైడ్రోజను, ఆక్సిజన్ రెండూ చేరినప్పుడు నీరు అవుతుంది అంటారు. అయితే, నీరుని నీవు సృష్టించవచ్చు. హైడ్రోజను, ఆక్సిజనులను ఎవరు సృష్టించారు? హైడ్రోజను, ఆక్సిజను రెండూ ఉండినప్పుడు కదా నీవు నీరుగా మార్చగలుగుతున్నావు? ఈ నీరు ఆధేయము. హైడ్రోజను, ఆక్సిజనులు ఆధారము, ఆధారము లేకుండా ఆధేయము ఉండటానికి వీలు కాదు. ఈ ఆధేయము క్రమక్రమేణా మార్పు చెందుతూ వస్తుంది. ఈ మార్పు చెందునదే సైన్సు, మార్పు చెందనిదే spirituality అనగా ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికమనగా కేవలము పూజలు చేయడము, కొన్నిసత్కర్మలు ఆచరించడము, దైవకార్యములలోపాల్గొనడముఅనుకుంటున్నాముమనము.Spiritualityఅనగాspiritof low. Science అనగా split of love. Split of love changes. Sprit of love permanent. Spirituality లేక culture లేదు. కల్మషమే అయిపోతుంది. Culture and spirituality ఆనగా ప్రేమతో కూడిన శక్తి.
(భ.స.మ. పు. 21)
(చూ|| జగదీశుడు, జన్మాద్యస్యయతః, చైతన్యము, బ్రహ్మ, సమాజము)