బుద్ధికి విజ్ఞానము అని మరొకపేరు. ఈ విజ్ఞానము బాహ్యసంబంధమైన విషయములను మాత్రమే విమర్శించి విచారణ సల్పి నిర్ణయాలు చేస్తుంది. బుద్ధి ఆంతరసమస్యలను కూడ తీర్చి, ఒకనిర్ణయానికి వస్తుంది. కనుక దీనికి విజ్ఞానము అనేది సరియైన పేరుకాదు. విజ్ఞానము లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినది బుద్ధి అంత స్సంబంధమైన సూక్ష్మస్వరూపమైన తత్వానికి సంబంధించినది కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించటము అత్యవసరము.
(బృత్ర.పు.94)
ఆధ్యాత్మికానికి, విజ్ఞానానికి వ్యత్యాసమును చెప్పాలంటే ఒకే పదము spirit of love = spirituality ఇదే ఆధ్యాత్మికము . split of love= science ఇదే విజ్ఞానము. ఉన్నది. చిన్న పదమేకాని ఎంత వ్యత్యాసమో చూడండి విజ్ఞానము భోగ భాగ్యములను అనుకూలసదుపాయములను అందిస్తున్నది. కాని మానవునికి కావలసినది అంతర్ స్సంబంధమైన ఆనందము కోరేది ఆనందము, ప్రయత్నించేది ఆనందము నిమిత్తము. కాని ఆనందము వస్త్వాదులందున్నదా? విషయములందున్నదా? ఆనందమునిచ్చే వస్తువులే అశాశ్వత మయినప్పుడు నీ నిత్యానందమునకెట్లు లభ్యమవుతుంది? ఇచ్చే పదార్థములు అశాశ్వతమే. అనుభవించేదేహములు అశాశ్వతమే. నివసించే దేశము అశాశ్వతమే. మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలను కుంటే మానసిక తత్వాన్ని సరియైన స్థితిలో ఉంచుకోవాలి. ఈ నాటి వైజ్ఞానిక పరిజ్ఞానములో భౌతిక అభివృద్ధి రాజకీయ పరిణామము ఆర్థిక పరిణామము. వైజ్ఞానిక పరిణామము, లౌకకి పరిణామము అన్ని అభివృద్ధిగాంచినాయి. కాని మానసిక పరిణామము మాత్రము కలుగలేదు. ఈ మానసిక పరిణామము తరువాత ఆధ్యాత్మిక పరిణామము కూడా అవసరము.
(బృృత్ర.పు.97)
(చూ॥ ఆజ్ఞానము, ఆత్మవిశ్వాసము, ఆధ్యాత్మికము, పరిజ్ఞానము, పరిశీలన విక్షేపము, విద్య)